Keerthy Suresh in Sai Dharam Tej Movie

Saturday,December 12,2020 - 11:42 by Z_CLU

Sai Dharam Tej - Keerthy Suresh వీలైతే ఈసారి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. సాయితేజ్ కొత్త సినిమాలో మహానటి కీర్తిసురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు మేకర్స్. ప్రస్తుతానికైతే చర్చలు సాగుతున్నాయి.

కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు సాయితేజ్. స్టార్ డైరక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లేతో వస్తున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. ఇప్పుడీ ప్రాజెక్టులోకి హీరోయిన్ గా కీర్తిసురేష్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

[caption id="attachment_181227" align="alignnone" width="640"]Keerthy Suresh Keerthy-Suresh-Stills[/caption]

కుదిరితే ఒకేసారి 2 సినిమాలు సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు Sai Dharam Tej. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను రిలీజ్ కు రెడీ చేసిన ఈ మెగా హీరో, దేవకట్టా సినిమాతో పాటు కార్తీక్ దండు మూవీని ఒకేసారి స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు.

సోలో బ్రతుకే సో బెటర్ పూర్తిగా రొమాంటిక్-కామెడీ మూవీ. దేవకట్టాతో చేయబోతున్న రిపబ్లిక్ అనే సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ. ఇక కార్తీక్ దండు సినిమా మిస్టిక్ థ్రిల్లర్. ఇలా తన సినిమాల్ని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు సాయితేజ్.

Also Check - జీ స్టుడియోస్ తో సాయితేజ్ బంధం