Keerthy Suresh First Look from ‘Dasara’

Monday,October 17,2022 - 12:50 by Z_CLU

నేచురల్ స్టార్ నాని మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ తో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ఈ చిత్రం కోసం ఫుల్ లెంత్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్నాడు నాని. ఈ పాత్ర కోసం మాస్, రగ్గడ్ లుక్ లోకి మేకోవర్ అయ్యారు నాని. సినిమా అనౌన్స్ మెంట్ వీడియోలో నాని తెలంగాణ యాస అందరినీ ఆశ్చర్యపరిచింది. నాని సినిమా అంతా మాస్ డైలాగులతో మెప్పించబోతున్నాడు. ఇటివల రిలీజ్ చేసిన మాస్ సాంగ్ మిలియన్ వ్యూస్ తో హిట్ సాంగ్స్ లిస్టులో చేరిపోయింది.

తాజాగా ఈ సినిమా నుండి కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. పసుపు సారీలో పెళ్లి తర్వాత భాజలకు డాన్స్ వేస్తూ డస్కీ లుక్ లో కనిపిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఎట్రాక్ట్ చేసింది కీర్తి. సినిమాలో కీర్తి సురేష్ కూడా మాస్ కేరెక్టర్ లో కనిపించనుంది. నాని -కీర్తి మధ్య వచ్చే లవ్ ట్రాక్ , ఎమోషనల్ సీన్స్ సినిమాకి హైలైట్స్ అని చెప్తున్నారు.

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని (తెలంగాణ)లోని సింగరేణి బొగ్గు గనులలో ఉన్న ఒక గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతోంది. నాని ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నారు. 'దసరా' వచ్చే ఏడాది మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.

సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.ఈ చిత్రానికి ఎడిటర్‌ గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.