Karthi’s ‘Sardar’ world television on 18th feb only on zee cinemalu

Tuesday,February 07,2023 - 04:36 by Z_CLU

గతేడాది నవంబర్ లో థియేటర్లలో కొచ్చిన సర్దార్ సినిమా గట్టి పోటీ మధ్య రిలీజైన దీపావళి విన్నర్ గా నిలిచింది. ఓవైపు స్ట్రయిట్ తెలుగు సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, సర్దార్ కంటెంట్ ముందు అన్నీ తేలిపోయాయి. విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది సర్దార్.

ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తుంది సర్దార్. ఈ నెల 18 న జీ సినిమాలు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ టెలికాస్ట్ అవ్వనుంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కార్తి, 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. పోలీసాఫీసర్ గా, గూఢచారిగా మెప్పించాడు. రాశిఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మిత్రన్ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా ద్వారా కార్తీ ఇచ్చిన సందేశానికి ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ నిలిచాయి.

సర్దార్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ZeeCinemalu లో శనివారం సాయంత్రం 6 గం. లకు dont miss