Karthikeya 2 Theatrical Trailer Review

Saturday,August 06,2022 - 08:35 by Z_CLU

"ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లలోనే చూడాలి. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం తీసిన సినిమా ఇది." కార్తికేయ-2 ప్రమోషన్స్ లో హీరో నిఖిల్ పదే పదే చెప్పిన మాట ఇది. కొంతమందికి చిరాకు తెప్పించినా తను ఈ విషయాన్ని పదేపదే చెబుతానంటూ నిఖిల్ గుర్తుచేసేవాడు. అతడు అలా ఎందుకు అంత గట్టిగా చెప్పాడో ఇప్పుడు అందరికీ అర్థమైంది. కొద్దిసేపటి కిందట విడుదలైన కార్తికేయ-2 ట్రయిలర్ చూడ్డానికి రెండు కళ్లు పట్టవు.

అద్భుతమైన విజువల్స్, కళ్లుచెదిరే విజువల్ ఎఫెక్ట్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇలా చెప్పుకుంటూ పోతే Karthikeya 2 Trailer లో అడుగడుగునా స్పెషాలిటీస్ కనిపిస్తూనే ఉన్నాయి. టెక్నికల్ గా ఈ ట్రయిలర్ ఒక ఎత్తయితే, ఇందులో చూపించిన కంటెంట్ మరో ఎత్తు.

మిస్టిక్ థ్రిల్లర్ సబ్జెక్ట్ కు కృష్ణ తత్వాన్ని యాడ్ చేస్తూ రాసుకున్న ఈ కథ కట్టిపడేసేలా ఉండబోతోందనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతోంది. కార్తికేయ-2పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ ట్రయిలర్ తో ఆ ఎక్స్ పెక్టేషన్స్ డబల్-ట్రిపుల్ అయ్యాయి.

కార్తికేయగా నిఖిల్ ఎప్పీయరెన్స్ ట్రయిలర్ లో స్టన్నింగ్ గా ఉంది. ఇక అనుపమ పరమేశ్వరన్ కూడా కేవలం హీరోయిన్ లా కాకుండా, కథలో ఓ పాత్రలా కనిపించింది. వీళ్లతోపాటు అనుపమ్ ఖేర్ లాంటి కీలకమైన నటీనటులందర్నీ చకచకా ట్రయిలర్ లో పరిచయం చేశారు. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రయిలర్ లో మరో మెయిన్ ఎట్రాక్షన్.

ఇలా చెప్పుకుంటూపోతే కార్తికేయ-2 ట్రయిలర్ ఓ వండర్ అనిపిస్తోంది. ట్రయిలరే ఇలా ఉందంటే, బిగ్ స్క్రీన్ పై సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. 13న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది కార్తికేయ-2.