Karthikeya 2 First Week (7 Days) Collection

Saturday,August 20,2022 - 04:22 by Z_CLU

నిన్నటితో వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది కార్తికేయ2 సినిమా. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో పెద్ద హిట్టయింది. విడుదలైన ఈ వారం రోజుల్లో సినిమాకు వరల్డ్ వైడ్ 60 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు స్టడీగా వసూళ్లు వస్తున్నాయి. తొలి రోజు ఏపీ, నైజాంలో దాదాపు 3 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ రాబట్టిన ఈ సినిమాకు ఏడో రోజు కూడా 2 కోట్ల రూపాయలకు తగ్గకుండా షేర్ రావడం చాలా పెద్ద విషయం.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 7 రోజుల్లో (Total 7 Days) మొత్తంగా 18 కోట్ల 69 లక్షల రూపాయల షేర్ వచ్చింది. 4 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. నిన్నటి వసూళ్లతో కలిపి డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

అటు హిందీలో ఈ సినిమాది ప్రభంజనం అనే చెప్పాలి. మొదటి రోజు ఉత్తరాదిన ఈ సినిమాకు 7 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. అదే నిన్నటి రోజున చూస్తే కార్తికేయ-2 హిందీ వెర్షన్ కు ఏకంగా 2 కోట్ల 46 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా నార్త్ బెల్ట్ లో వారం రోజుల్లో 8 కోట్ల 21 లక్షల రూపాయలు వచ్చాయి. మొదటి రోజు కేవలం 50 థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, ఇప్పుడు ఏకంగా 1300 స్క్రీన్స్ లో రన్ అవుతోంది.

Karthikeya2 7 days collection

తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ-2 సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి నైజాం - 7.02 కోట్లు సీడెడ్ - 2.91 కోట్లు ఉత్తరాంధ్ర - 2.59 కోట్లు ఈస్ట్ - 1.54 కోట్లు వెస్ట్ - 1.03 కోట్లు గుంటూరు - 1.65 కోట్లు నెల్లూరు - 59 లక్షలు కృష్ణా - 1.36 కోట్లు