Kamal’s Indian 2 to begin soon

Tuesday,August 31,2021 - 12:02 by Z_CLU

కమల్ హాసన్ -శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఇండియన్' సినిమా అప్పట్లో భారీ హిట్ సాధించింది. తెలుగులో 'భారతీయుడు' టైటిల్ తో డబ్బింగ్ అయి ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే మళ్ళీ ఈ కాంబినేషన్ లో దానికి కొనసాగింపు తీయలనుకున్నారు కమల్ -శంకర్. 2019 లో 'ఇండియన్2' ను గ్రాండ్ లాంచ్ చేశారు. హీరోయిన్ గా కాజల్ ని తీసుకున్నారు. వెంటనే షూట్ కూడా మొదలు పెట్టారు. కానీ షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి సినిమాకు అంతరాయాలు ఏర్పడ్డాయి.

ఇక షూటింగ్ జరుగుతుండగా పై నుండి క్రేన్ కింద పడటంతో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు. పది మందికి గాయాలు కూడా అయ్యాయి. మేకర్స్ బాధితుల కుటుంబానికి పరిహారం కూడా అందించారు. అప్పటి నుండి షూటింగ్ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక శంకర్ తెలుగులో రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయి వెంటనే హిందీ లో రన్విర్ సింగ్ తో 'అన్నియన్' (అపరిచితుడు) రీమేక్ కూడా ప్రకటించాడు.

దీంతో ఇక శంకర్ 'ఇండియన్ 2' ని లైట్ తీసుకున్నారని ప్రొడక్షన్స్ ఇబ్బందుల వలన ఈ షూటింగ్ ఆగిపోయిందని ఇక సెట్స్ పైకి వెళ్ళడం కష్టమే అనే టాక్ వినబడింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా న్యూస్ లోకి వచ్చింది. ఇటివలే ఇండియన్ 2 నిర్మాతలు శంకర్ ని కలిసి మిగతా పార్ట్ షూట్ కంప్లీట్ చేయాల్సింది గా మాట్లాడారని తెలుస్తుంది. ప్రస్తుతం కమిట్ అయిన రెండు సినిమాలు పూర్తయ్యాకే ఆ సినిమాను టేకప్ చేస్తానని శంకర్ చెప్పారని సమాచారం.

సినిమాకు సంబంధించి దాదాపు 60 % షూట్ పూర్తయింది. మిగిలిన భాగాన్ని శంకర్ ఎప్పుడు కంప్లీట్ చేసి థియేటర్స్ లోకి తీసుకొస్తారో చూడాలి. ఏదేమైనా ఆగిపోయిన స్టేజి నుండి మళ్ళీ కమల్ -శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. అదెప్పుడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics