KalyanRam’s Bimbisara 3 Days Collections

Monday,August 08,2022 - 03:33 by Z_CLU

బింబిసార సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. విడుదలైన 3 రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి ఎంటరైంది. తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా, రిలీజైన 3 రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) ఏకంగా 15 కోట్ల 90 లక్షల రూపాయల షేర్ సాధించింది. కల్యాణ్ రామ్ కెరీర్ లో 3 రోజుల్లో లాభాల్లోకి ఎంటరైన ఫస్ట్ మూవీ ఇదే. అంతేకాదు, రీసెంట్ రిలీజెస్ లో ఈ ఫీట్ సాధించిన మూవీ కూడా ఇదే.

నిన్నటి వసూళ్లతో నైజాం, సీడెడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. లాభాల్లోకి కూడా ఎంటరైంది. ఇదే ఊపు కొనసాగితే, ఈ వారాంతానికి సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు రావడంతో, ఓవరాల్ గా బింబిసార బ్లాక్ బస్టర్ అయింది.

తెలుగు రాష్ట్రాల్లో బింబిసార సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి. నైజాం - 5.66 కోట్లు సీడెడ్ - 3.38 కోట్లు ఉత్తరాంధ్ర - 2.26 కోట్లు ఈస్ట్ - 1.02 కోట్లు వెస్ట్ - 73 లక్షలు గుంటూరు - 1.27 కోట్లు నెల్లూరు - 50 లక్షలు కృష్ణా - 88 లక్షలు