Kalyan Dev’s Kinnerasani Movie Updates

Monday,January 04,2021 - 10:19 by Z_CLU

మెగా హీరో క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ (అశ్వ‌ధామ ఫేమ్) కాంబినేష‌న్ లో ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో తెరకెక్కుతున్న‌ సినిమా కిన్నెర‌సాని. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కిన్నెర‌సాని టైటిల్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ కూడా క్లిక్ అయింది. న్యూ ఇయర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేశాడు కల్యాణ్ దేవ్. విజేతతో హీరోగా మారిన ఈ నటుడు.. తన రెండో ప్రయత్నంగా సూపర్ మచ్చి సినిమా చేస్తున్నాడు. కిన్నెరసాని ఇతడికి మూడో సినిమా.

ఈ చిత్రానికి దేశరాజ్ సాయితేజ క‌థ, క‌థ‌నం అందిస్తున్నాడు. గ‌తంలో సాయితేజ్, క‌ల్కి చిత్రానికి స్టోరీ అందించాడు. అలానే ఛ‌లో, భీష్మ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

హీరో - క‌ళ్యాణ్ దేవ్ బ్యానర్ - ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభ‌మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ - సాయిరిషిక‌ నిర్మాత - రజ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల‌ క‌థ, క‌థ‌నం - దేశ్ రాజ్ సాయితేజ్ సంగీతం - మ‌హతి సాగ‌ర్ సినిమాటోగ్రాఫర్ - దినేశ్ కే బాబు ఎడిటింగ్ - అన్వ‌ర్ అలీ ప్రొడ‌క్ష‌న్ డిజైన్ - శ్రీ నాగేంద్ర తంగ‌ల పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్ సౌండ్ డిజైన్ - సింక్ సినిమా ద‌ర్శ‌కుడు - ర‌మ‌ణ తేజ‌