Kalavathi Song : Ghattamaneni Sithara’s dance reel viral on Social Media

Monday,February 21,2022 - 04:40 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' నుండి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. ప్రెజెంట్ ఎక్కడ విన్నా ఈ సాంగే వినబడుతుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైనా సూపర్ హిట్ సాంగ్ రాగానే దాన్ని అందరూ రీల్స్ చేయడం సర్వసాధారణం. అయితే మహేష్ కళావతి పాటతో సోషల్ మీడియాలో చాలానే రీల్స్ వస్తున్నాయి. కానీ ఒకే ఒక్క రీల్ మాత్రం ఊహించని విధంగా వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CaMDkwxFLbI/

ఇంతకీ ఆ రీల్ వీడియో చేసింది ఎవరో కాదు. మహేష్ గారాలపట్టి  సితార. తండ్రి స్టెప్స్ ని ఉన్నది ఉన్నట్టుగా దించేసి ఇలా రీల్ పెట్టిందో లేదో వెంటనే మిలియన్ల వ్యూస్ వీడియో వైరల్ అయిపోయింది. మహేష్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ మ్యూజిక్ లవర్స్ అంతా ఈ వీడియోని స్టేటస్ గా పెట్టుకుంటూ మరింత పాపులర్ చేస్తున్నారు.

నిజానికి తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మేకర్స్ అనుకున్న టైం కంటే ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. అప్పటి నుండే సాంగ్ పాపులర్ నంబర్ గా దూసుకెళ్తోంది. ఇక సితార రీల్ పుణ్యమా అని ఇంకాస్త ఎక్కువే రీచ్ అయ్యింది. వర్క్ చేస్తున్న ప్రతీ హీరోకి బెస్ట్ సాంగ్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న తమన్ మరోసారి మహేష్ కి బెస్ట్ సాంగ్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఈ సాంగ్ పదే పదే వింటూ యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందిస్తున్నారు. రిలీజైన ఎనిమిది రోజులకే ముప్పై ఏడు మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది ఈ సాంగ్.

 Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics