Kajal Aggarwal weds Gautam Kitchlu in Mumbai

Saturday,October 31,2020 - 08:09 by Z_CLU

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది. ముంబయిలోని ఓ హోటల్ లో రాత్రి సింపుల్ అండ్ స్వీట్ గా కాజల్ పెళ్లి జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ గౌతమ్ కిచ్లును ఆమె పెళ్లాడింది.

గౌతమ్ కిచ్లు కుటుంబానికి, కాజల్ ఫ్యామిలీకి చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో పడింది మాత్రం రెండేళ్లు కిందటే. అప్పట్నుంచి డేటింగ్ లో ఉన్న కాజల్... పెళ్లి విషయాన్ని ఈ నెలలో ప్రకటించింది.

పెళ్లి మేటర్ ఎనౌన్స్ చేసినప్పట్నుంచి రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇస్తూనే ఉంది కాజల్. పెళ్లి తర్వాత తను, గౌతమ్ కలిసి ఉండే ఇల్లును కూడా చూపించింది.

kajal marriage

కరోనా వల్ల పెళ్లికి సెలబ్రిటీస్ ఎవ్వర్నీ ఆహ్వానించలేదు కాజల్. పూర్తిగా కుటుంబ సభ్యుల మధ్య Kajal Wedding జరిగింది.

పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతుంది ఈ చందమామ. కొన్నిరోజులు మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేసిన తర్వాత, ఆచార్య మూవీ సెట్స్ పైకి వస్తుంది. ఆమె చేతిలో ఇండియన్-2 కూడా ఉంది.

Also Check- కాజల్ పెళ్లి ఫొటోలు