January Box Office Review

Monday,February 01,2021 - 04:40 by Z_CLU

కరోనా/లాక్ డౌన్ నుంచి ఇండస్ట్రీ కోలుకున్న తర్వాత పూర్తిస్థాయిలో జనవరి నుంచి సినిమాలు థియేటర్లు బాటపట్టాయి. సంక్రాంతి సీజన్ కూడా యాడ్ అవ్వడంతో, జనవరి మొదటి వారం నుంచి వరుసపెట్టి సినిమాలొచ్చాయి. మరి లాస్ట్ మంత్ రిలీజైన మూవీస్ లో ఆకట్టుకున్న సినిమాలేంటి? Tollywood Boxoffice review

krack-movie-review-telugu 2

జనవరి ఫస్ట్ వీక్ లో షకీలా అనే సినిమా ఒక్కటే రిలీజైంది. అది పెద్దగా ఎటెన్షన్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక సెకెండ్ వీక్ లో సంక్రాంతి సినిమాలు క్యూ కట్టాయి. క్రాక్ నుంచి మొదలుపెట్టి మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి.

red-movie-telugu-review 2

వీటిలో రవితేజ నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్టయింది. ఆ తర్వాతొచ్చిన మాస్టర్ వసూళ్లలో మెప్పించినప్పటికీ, హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇక రామ్ నటించిన రెడ్ సినిమా వసూళ్ల పరంగా హిట్ అనిపించుకోగా.. అల్లుడు అదుర్స్ మూవీ ఫ్లాప్ అయింది.

Bangaru-bullodu-review-in-telugu

ఇక జనవరి మూడో వారంలో వచ్చిన బంగారు బుల్లోడు సినిమా అల్లరినరేశ్ కు సక్సెస్ ఇవ్వలేకపోయింది. కామెడీ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. ఇక జనవరి లాస్ట్ వీక్ లో ఏకంగా 6 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి.

30-Rojullo-Preminchadam-Ela-Movie-telugu-Review

30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అన్నపూర్ణమ్మగారి మనవడు, జై సేన, కళాపోషకులు, మిస్టర్ అండ్ మిస్, చెప్పినా ఎవ్వరూ నమ్మరు సినిమాలు జనవరి బాక్సాఫీస్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాయి. కానీ వీటిలో ఏదీ ఆకట్టుకోలేకపోయింది. ప్రదీప్ హీరోగా పరిచయమైన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా మంచి ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది.

ఓవరాల్ గా జనవరి బాక్సాఫీస్ లో క్రాక్ సినిమా హిట్ మూవీగా నిలిచింది.