Interview – Producers Vijay, Sashi (Sridevi Soda Center)

Wednesday,August 25,2021 - 06:56 by Z_CLU

నిర్మించింది తక్కువ సినిమాలే అయినా 70mm ఎంటర్టైన్ మెంట్స్ కి ఓ గుర్తింపు ఉంది. ఈ సంస్థలో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ బేనర్ నుండి రాబోతున్న మరో సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్' శుక్రవారం థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్, శశిధర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే.

చిన్న అవాంతరాలు జరిగాయి

సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొన్ని అవాంతరాలు జరిగాయి. షూట్ మొదలు పెట్టిన ఫస్ట్ డే మెయిన్ కెమెరా రోడ్ మీద పడిపోయింది. లక్కీగా కెమెరాకి ఏం అవ్వలేదు. ఆరోజు బ్యాడ్ స్టార్ట్ అనుకున్నాం. నెక్స్ట్ రోజు ఐదున్నరకే షూటింగ్ కి ప్యాకప్ చెప్పేశామ్. సో రెండో రోజు బాగానే జరిగింది హమ్మయ్య అనుకున్నాం. కానీ సెట్ నుండి బయటికి వస్తుంటే క్యార్ వాన్ అసిస్టెంట్ కి షాక్ కొట్టిందనే న్యూస్ విన్నాం. తను ఇంజురీ అయ్యాడు. సో ఇదేంటి..? ఏం జరుగుతుంది అని భయమేసింది. కానీ అవేం పట్టించుకోకుండా పాజిటివ్ గా షూట్ ఫినిష్ చేశాం. జస్ట్ ఫస్ట్ గ్లిమ్స్ కే బిజినెస్ క్లోజ్ అయిపొయింది. సో అనుకున్న విధంగా సినిమాను కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం.

sridevi soda చాలా కథలు విన్నాం

నిజానికి గ్యాప్ తీసుకోలేదు. వచ్చింది. తక్కువ సినిమాలు చేసినా మన బేనర్ నుండి సినిమా వస్తుంది అంటే ఒక క్వాలిటీ ఉంటుందని ప్రేక్షకులు అనుకోవాలి అనుకుంటాం. యాత్ర తర్వాత అందరూ మళ్ళీ అలాంటే బయోపిక్ కథలే చెప్పారు. ఫైనల్ గా కరుణకుమార్ గారు చెప్పిన ఈ కథ బాగా నచ్చడంతో సినిమాను మొదలు పెట్టాం.

టైటిల్ ముందు వేరే

ఈ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ 'నల్ల వంతెన' కరుణ కుమార్ గారు కథ చెప్పడమే ఆ టైటిల్ తో చెప్పారు. కానీ ఆ టైటిల్ కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఓ మంచి టైటిల్ పెట్టాలని అనుకున్నాం. లక్కీగా ఈ టైటిల్ కుదిరింది. సినిమా అంతా ఆ సోడా సెంటర్ దగ్గరే జరుగుతుంది కాబట్టి అదే ఫిక్స్ చేశాం. సినిమాకి ముందు బజ్ రావడానికి టైటిల్ కూడా హెల్ప్ అయింది.

మణిశర్మ గారు మా ఛాయిసే

రూరల్ లో నేచురల్ గా ఉండే సినిమా ఇది. దీనికి మన తెలుగు నేటివిటీ తెలిసిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుందని భావించాము. అందుకే వెంటనే మణి గారిని సంప్రదించాం. ఇప్పటి వరకు ఫుల్లెంత్ విలేజ్ సినిమా చేయలేదు కాబట్టి ఆయన కూడా చాలెంజింగ్ గా భావించి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ ఎక్స్ ట్రార్దినరీగా ఉంటుంది. దాని గురించి రిలీజ్ తర్వాత అందరూ మాట్లాడతారు.

అది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ చూసి ఇలాంటి కథతో కొన్ని మూవీస్ వచ్చాయి. ఎలా డీల్ చేశారు అనే డౌట్స్ కొందరికి ఉన్నాయి. కరుణకుమార్ గారు తను రాసుకున్న కథను అంతే అందంగా తీశారు. రేపు రిలీజ్ తర్వాత బాగా డీల్ చేశారు. ఒక మంచి సినిమా అనే కాంప్లిమెంట్స్ వస్తాయని అనుకుంటున్నాం.

vijay chilla sashi devireddy

సుదీర్ తో మా అనుబంధం అలా ఉంటుంది

సుదీర్ , మేము క్లోజ్ ఫ్రెండ్స్. తనతో మాకిది రెండో సినిమా. కానీ సెట్ లో మాత్రం తను ఒక హీరో మేము నిర్మాతలం అలాగే ఉంటాం. బిజినెస్ యాంగిల్ కొచ్చేసరికి అలా ఉంటేనే కరెక్ట్ అని నమ్ముతాం. ఆఫ్టర్ షూట్ మా ఫ్రెండ్షిప్ మాములుగానే ఉంటుంది. తన క్యారెక్టర్ కి ఎప్పటిలాగే బెస్ట్ ఇచ్చాడు. ఈ సినిమా తన కెరీర్ కి ఇంకా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాం.

నెక్స్ట్ సినిమా అదే

ప్రస్తుతం మా బేనర్ లో వచ్చే నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఫైనల్ అవ్వగానే ఆ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేసి సెట్స్ పై పెడతాం. ఒక్కో సినిమా మాత్రమే చేస్తాం. ఒకేసారి రెండు సినిమాలు నిర్మించే ఆలోచన అస్సలు లేదు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics