Interview – NagaShaurya (Varudu Kaavalenu)

Tuesday,October 26,2021 - 04:21 by Z_CLU

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది వరుడు కావలెను సినిమా. లక్ష్మీ సౌజన్య డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నాడు హీరో నాగశౌర్య.

- సినిమాలో ఓ 15 నిమిషాల ఎపిసోడ్ నేను సినిమా చూశాను. మా టీమ్ అంతా చూశాం. బాగుందని ఫీలయ్యాం. ఫస్ట్ టైమ్ మా సినిమా నుంచి 2 నిమిషాల రూపంలో ట్రయిలర్ బయటకెళ్లింది. ఆ ట్రయిలర్ బాగా వైరల్ అయింది. చాలా క్లాసీగా ఉందన్నారు జనాలు. మేం సినిమా చూసి ఏదైతే ఫీల్ అయ్యామో, ఆడియన్స్ నుంచి ఫీడ్ బ్యాక్ కూడా అదే వచ్చింది. ట్రయిలర్ విషయంలో ఫుల్ హ్యాపీ.

- ముందు అనుకున్న సబ్జెక్ట్ కాదు. వరుడు కావలెను టైటిల్ తో వచ్చిన సబ్జెక్ట్ లో చాలా మార్పుచేర్పులు జరిగాయి. లైన్ అదే ఉంది. లాక్ డౌన్ లో మరింత బెటర్ గా మార్పులు జరిగాయి. బెస్ట్ వెర్షన్ వచ్చింది.

- ట్రయిలర్ లో చెప్పని వెర్షన్ సినిమాలో ఉంది. అది ఓ 15 నిమిషాల ఎపిసోడ్. దాన్ని కావాలనే దాచిపెట్టాం. ఆ ఎపిసోడ్ థియేటర్లలోనే చూడాలి. ఆడియన్స్ కొత్తగా ఫీల్ అవుతారు. అలా అని మరీ సర్ ప్రైజ్ కాదు. సడెన్ గా చూసినప్పుడు చిన్న సర్ ప్రైజ్ అనిపిస్తుంది. ఆ 15 నిమిషాల చిన్న ఎపిసోడ్ లోనే కథకు సంబంధించిన క్యారెక్టర్ల ఎలివేషన్స్ ఉంటాయి. ఎందుకు హీరోయిన్ అలా బిహేవ్ చేస్తుందనేది ఆ 15 నిమిషాల్లోనే చెప్పాం.

- టైమ్ బాగున్నప్పుడు అన్నీ కలిసొస్తాయి. చెడు కూడా మంచిగానే టర్న్ అవుతుంది. ప్రస్తుతం నా టైమ్ బాగుందనుకుంటున్నాను. నచ్చని ప్రాజెక్టులు కూడా నచ్చేలా వస్తున్నాయి. దేవుడు నాకోసం అన్నీ క్లియర్ చేస్తున్నాడనిపిస్తోంది. నేను దేవుడ్ని నమ్మను. ఒక్క దేవుడు మాత్రం ఉన్నాడు. అతడు జీససా, అల్లానా, హిందూ దేవుడా అనేది మనం చెప్పలేం. బట్ దేవుడు ఒక్కడే. అదే నేను నమ్ముతాను.

- వరుడు కావలెను సినిమా కథ సింపుల్ గా ఉంటుంది. మన ఇంట్లో ఓ అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లీడుకు రాగానే పెళ్లి చేసుకోమంటారు పెద్దోళ్లు. అదే టాపిక్ పై సినిమా నడిస్తే అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్మకం, అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను. ప్రతి లవ్ స్టోరీ రొటీన్ గానే అనిపిస్తుంది. కానీ ఆ ప్రాసెస్ కొత్తగా ఉంటుంది. మా వరుడు కావలెను సినిమా కూడా అంతే.

Varudu Kaavalenu Movie Sangeet function nagashaurya ritu varma pooja hegde

- సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో చేయడం లక్కీగా ఫీల్ అవుతున్నాను. చాలా కంఫర్టబుల్ అనిపించింది. మరోసారి సితార ఎంటర్ టైన్ మెంట్ లో చేయాలనుకుంటున్నాను.

- సినిమా షూటింగ్ టైమ్ లో నాకు, రీతూ వర్మకు ఎలాంటి గొడవలు జరగలేదు. మొన్న ట్రయిలర్ లాంచ్ కు రాకపోయేసరికి అంతా అలానే అనుకున్నారు. అందుకే నేను క్లారిటీ ఇచ్చాను. నాకు, రీతూకు ఎలాంటి గొడవల్లేవు. తను వేరే సినిమా షూట్ లో ఉంది. రీతూ చాలా మంచి అమ్మాయి.

- ఆర్టిస్టులు రెగ్యులర్ జిమ్ కు వెళ్లలేరు. ఎందుకంటే, టైమింగ్స్ సెట్ అవ్వవు. ఒక్కోసారి నైట్ షూట్ చేసి పగలు పడుకోవాల్సి వస్తుంది. కాబట్టి సొంత జిమ్ ఉంటే బెటర్. దీంతో పాటు మనతో పాటు ఓ ట్రయినర్ కూడా ఉండాలి. నాకు ఆంటోనీ అనే మంచి ట్రయినర్ దొరికాడు. నా ఫేస్ పాడవ్వకుండా సిక్స్ ప్యాక్ సాధించడం ఎలా అనే అంశంపై చాలా రీసెర్చ్ చేశాం. అనుకున్నది సాధించాం. భవిష్యత్తులో కూడా ఇలానే ఫిట్ గా ఉంటాను.

- నేను కథలు ఎంపిక చేసుకునే తీరు మారింది. గడిచిన 5-6 సినిమాలు చూస్తే నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. కొత్తగా ఆలోచిస్తున్నాను. ఈ ప్రాసెస్ లో రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నప్పుడు నాకు తెలిసిపోతోంది. క్వశ్చన్ చేయకపోతే నా తప్పు అవుతుంది. క్వశ్చన్ చేస్తే అది బయటకు మరో తప్పుగా కనిపిస్తోంది. ఎలాగూ తప్పు అవుతుందని తెలిసినప్పుడు సినిమా కోసం నేనే క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాను. నేను అలా అడగకపోతే రేపు ఉదయం ఎవరో వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తారు. దానికంటే ముందే నేను డైరక్టర్ ను క్వశ్చన్ చేయడంలో తప్పు లేదనుకుంటాను.

- వరుడు కావలెను సినిమా టైటిల్ హీరోయిన్ సెంట్రిక్ గా ఉంది. ట్రయిలర్ కూడా అలానే ఉంది దాదాపుగా. కొంతమంది నన్ను ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమానా అని అడిగారు. అలాంటివాళ్లంతా సినిమా చూసిన తర్వాత మాట్లాడాలి. సినిమా అయిపోయిన తర్వాత అందరికీ నేనే గుర్తుంటాను.

varudu kavalenu nagashaurya ritu varma 2

- ఇండస్ట్రీలో నాకు ఫ్రెండ్స్ తక్కువ. ఎక్కువగా ఎవ్వరితో కలవను. నా బెస్ట్ ఫ్రెండ్ నారా రోహిత్. ఎప్పటికప్పుడు రోహిత్ ను కలుస్తాను. రోహిత్ తర్వాత శర్వానంద్ తో టచ్ లో ఉంటానంతే. బయటకు కూడా పెద్దగా రాను. 30 ఏళ్లు అమ్మానాన్నతోనే ఉన్నాను. అందుకే ఇప్పుడు బయటకొచ్చాను. ఒక్కడ్నే ఉంటున్నాను. నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం. నైట్ పార్టీస్ జరిగిన తర్వాత ఇంటికొచ్చి అమ్మానాన్నను ఇబ్బంది పెట్టలేను. అందుకే రెండేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాను.

- వరుడు కావలెను సినిమా ఇంటర్వెల్ తర్వాత నుంచి మరో లెవెల్లో ఉంటుంది. చాలా కొత్తగా అనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమాపై నాకు నమ్మకం ఉంది. నాకే కాదు, యూనిట్ లో అందరికీ మంచి పేరు తెస్తుంది ఈ సినిమా.

- వరుడు కావలెను సినిమా తర్వాత లక్ష్య వస్తుంది. ఇందులో నా పాత్ర పేరు పార్థు. ఏదైనా గెలవాలంటే, ముందు ఆ మనిషి తనను తాను గెలవాలనే పాయింట్ ను ఈ సినిమాలో చూపిస్తున్నాం. నెల రోజుల గ్యాప్ లో వరుడు కావలెను, లక్ష్య వస్తున్నాయి. సొంత బ్యానర్ లో అనీష్ కృష్ణతో చేస్తున్న సినిమా 80శాతం కంప్లీట్ అయిపోయింది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాను పూర్తిచేయాలి. అమెరికా వీసాల సమస్య క్లియర్ అయిన వెంటనే ఆ సినిమా షూట్ స్టార్ట్ చేస్తాం.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics