Interesting Discussion on RRR Naatu-Naatu Song

Friday,November 12,2021 - 05:09 by Z_CLU

తెలుగు రాష్ట్రాల్లో RRR హంగామా మొదలైపోయింది. తాజాగా రిలీజ్ చేసిన నాటు-నాటు సాంగ్ తో ఈ హైప్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. అదే టైమ్ లో సినిమాపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. ఆ చర్చ ఏ స్థాయికి చేరుకుందంటే, స్వయంగా ఆర్ఆర్ఆర్ యూనిట్ దానిపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంటంటే.. RRR Movie నుంచి తాజాగా నాటు-నాటు లిరికల్ వీడియో రిలీజైంది. అందులో ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి చేసిన ఫుట్ మూమెంట్ ఒకటి ఉంది. అందర్నీ అది విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ మూమెంట్ లో చరణ్-తారక్ అంత ఫాస్ట్ గా డాన్స్ చేయలేదని, వీడియోను ఫాస్ట్ ఫార్వార్డ్ లో చూపించారంటూ ఓ చర్చ మొదలైంది.

తారక్-చరణ్ డాన్స్ పై ఓ రేంజ్ లో చర్చ నడుస్తోంది. ఇద్దరూ చాలా ఫాస్ట్ గా ఆ మూమెంట్ వేశారని కొందరు వాదిస్తుంటే, మరికొందరు మాత్రం మూమెంట్ కాస్త స్లోగానే ఉందని, ఎడిటింగ్ లో దాన్ని మ్యూజిక్ కు తగ్గట్టు సింక్ చేస్తూ, ఫాస్ట్ చేశారని కొందరు వాదించారు. ఈ మొత్తం చర్చకు ఫుల్ స్టాప్ పెట్టింది ఆర్ఆర్ఆర్ యూనిట్.

ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ తో పాటు రోర్ వీడియోల్ని కావాలనే ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపించిన విషయాన్ని మేకర్స్ బయటపెట్టారు. కానీ నాటు-నాటు సాంగ్ లో డాన్సింగ్ డైనమేట్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం చాలా స్పీడ్ గా డాన్స్ చేశారని, దాన్ని ఎడిట్ చేయకుండా అలానే లిరికల్ వీడియో పెట్టామని స్పష్టంచేసింది యూనిట్. వాళ్ల డాన్స్ మూమెంట్ రెగ్యులర్ స్పీడ్ తోనే సాగిందని క్లారిటీ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడింది.

ఇక ఇదే పాటకు సంబంధించి మరో చర్చకు కూడా ఫుల్ స్టాప్ పడింది. ఈ పాటలో బ్యాక్ గ్రౌండ్ లో కనిపించిన బిల్డింగ్ సెట్ అనుకున్నారు చాలామంది. కానీ అది ఉక్రెయిన్. ప్రత్యేకంగా ఈ సాంగ్ షూటింగ్ కోసమే గతంలో యూనిట్ అంతా ఉక్రెయిన్ వెళ్లింది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics