Interesting Discussion on Mahesh NTR Movies

Saturday,June 05,2021 - 03:42 by Z_CLU

 

ప్రస్తుతం ఇటివలే ఎనౌన్స్ చేసిన ఓ రెండు ప్రాజెక్ట్స్ పై విపరీతమైన చర్చ నడుస్తుంది. అందులో ఒకటి మహేష్ -త్రివిక్రమ్ కాంబో #Mahesh28 కాగా మరొకటి ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న #NTR30. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇంకా టైటిల్ ఎనౌన్స్ చేయలేదు మేకర్స్. దీంతో ఈ సినిమాల టైటిల్స్ పై అభిమానుల్లో గట్టి చర్చ నడుస్తుంది. స్టార్ హీరోలతో స్టార్ డైరెక్టర్స్ చేసే కమర్షియల్ సినిమాలకు పవర్ టైటిల్ కామన్. అదే ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తుంది.

[caption id="attachment_189918" align="alignnone" width="650"]ntr koratala movie zeecinemalu ఎన్టీఆర్ కొరటాల శివ[/caption]

ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ -త్రివిక్రమ్ సినిమాకు రెండు మూడు టైటిల్స్ అనుకుంటున్నారని అందులో ఒకటి ఫైనల్ చేయబోతున్నారని టాక్. వాటిలో 'అతడే ఆమె సైన్యం' అనే టైటిల్ గట్టిగా వినబడుతుంది. అలాగే ఎన్టీఆర్ -కొరటాల కాంబో సినిమాకు కూడా ఓ టైటిల్ తిరుగుతుంది. ఈ కాంబో సినిమాకు సెన్సేషనల్ అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉంది.

[caption id="attachment_179857" align="alignnone" width="650"]Mahesh-trivikram త్రివిక్రమ్ మహేష్[/caption]

ఇక కథకి తగిన టైటిల్స్ పెట్టడంలో త్రివిక్రమ్, కొరటాల ఇద్దరూ దిట్ట. త్రివిక్రమ్ టైటిల్స్ సింపుల్ గా అనిపించినా కథకి యాప్ట్ అనిపిస్తాయి. కొరటాల మాత్రం తన కథ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో టైటిల్ కూడా అంతే పవర్ ఫుల్ గా కమర్షియల్ గా ఉండేలా చూసుకుంటాడు. కొరటాల ప్రీవియస్ సినిమాల టైటిల్స్ గమనిస్తే ఈ విషయం ఇట్టె తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ సినిమాకు కొరటాల ఓ పవర్ ఫుల్ టైటిలే పెడతారని తారక్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ప్రెజెంట్ అందరు ఎదురుచూస్తున్న ఈ సినిమాల టైటిల్స్ ఎలా ఉండనున్నాయి ? వాటిని ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారు ? లాంటి విషయాలు తొందర్లోనే తెలియనున్నాయి. అప్పటి వరకూ ఈ సినిమాలకు సంబంధించి వివిధ టైటిల్స్ ప్రచారంలో ఉంటాయి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics