Interesting buzz on Nithin’s MacherlaNiyojakavargam

Tuesday,September 14,2021 - 05:03 by Z_CLU

మరో మూడు రోజుల్లో OTT ద్వారా 'మాస్ట్రో'  సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న నితిన్ ఇటివలే వినాయక చవితి సందర్భంగా 'మాచర్ల నియోజిక వర్గం' అనే  సినిమా ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. పలు విజయవంతమైన సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేసిన శేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారి మెగా ఫోన్ పట్టబోతున్నాడు. నితిన్ సొంత బేనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా షూట్ వచ్చే నెల నుండి మొదలు కానుంది.

టైటిల్ తో ఎట్రాక్ట్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ తో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ చక్కర్లు కొడుతుంది. సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారనేది లేటెస్ట్ న్యూస్. సినిమాలో ఆయన డ్యుయల్ రోల్ చేయనున్నారని , అవి  తండ్రి కొడుకుల పాత్రలని సమాచారం. ఇటివలే సముద్రఖని ని కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేసాడట దర్శకుడు శేఖర్.

Samuthirakani

కథతో పాటు క్యారెక్టర్స్ డిజైన్ కూడా నచ్చడంతో బిజీ షెడ్యుల్ లో కూడా ఈ సినిమాకు డేట్స్ ఇచ్చేందుకు సముద్రఖని అంగీకరించారని తెలుస్తుంది. 'అల వైకుంఠ పురములో', 'క్రాక్' సినిమాల్లో సముద్రఖని చేసిన విలన్ రోల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ప్రస్తుతం ఆయన RRR సినిమాతో పాటు తెలుగు మరికొన్ని పెద్ద సినిమాల్లో నటిస్తున్నారు.  మరి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న  నితిన్ 'మాచర్ల నియోజిక వర్గం' సినిమాలో సముద్రఖని డ్యుయల్ రోల్స్ తో ఎలా మెప్పిస్తారు ? రెండూ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ ఏనా ? తెలియాల్సి ఉంది.  నితిన్ సరసన 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో మిగతా కాస్టింగ్ ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics