Idi Maa Katha Movie Frist Look Launch

Thursday,November 19,2020 - 04:36 by Z_CLU

యంగ్ హీరో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్నచిత్రం `ఇదే మా కథ` (రైడర్స్ స్టోరి అనేది ఉపశీర్షిక). రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నఈ చిత్రానికి గురుపవన్ దర్శకుడు.

గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై జి.మహేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజు హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో `ఇదే మా కథ ఫస్ట్` లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ప్ర‌ధాన పాత్రధారులు రైడర్స్ గెటప్ లో బైక్ మీద రైడింగ్ కి వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు.

లాక్ డౌన్ కి ముందే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. లడఖ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ షూట్ స్టార్ట్ చేసి హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్తి చేశారు.. ఇంకా మ‌నాలి షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. డిసెంబ‌ర్‌లో అది పూర్తవుతుంది.

సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ లో వస్తున్న ఫుల్ లెంగ్త్ రోడ్ మూవీగా పేరు తెచ్చుకుంది `ఇదే మా కథ` సినిమా. ఇందులో ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ పాత్రలన్నీ ఎక్కడ, ఎలాంటి సందర్భంలో కలుసుకున్నాయనేది పాయింట్.