Icon Star Allu Arjun speech ‘Varudu Kaavalenu’ PreRelease Event !

Thursday,October 28,2021 - 05:12 by Z_CLU

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ ఈ నెల 29న విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది.

ముఖ్య అతిథిగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘  ‘దిగు దిగు నాగ’ పాట మా ఇంట్లో మోగుతూనే ఉంటుంది. నాగశౌర్య సినిమాలన్నీ చూశా.. అతను చాలా అందగాడు. మనసున్న వ్యక్తి. భవిష్యత్తులో పెద్ద హీరో అవుతాడు. ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయం కృషితో ఎదిగేవారంటే నాకు చాలా ఇష్టం.. శౌర్య తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్‌ సంపాదించుకున్నారు. ‘పెళ్లి చూపులు’ చూసి రీతూ వర్మ గురించి తెలుసుకున్నా. అమ్మాయిల్లో నాకు హుందాతనం అంటే ఇష్టం.. అది రీతూ దగ్గర చాలా ఉంది. ముంబయ్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు అన్ని విభాగాల్లో మహిళలు ఎక్కువశాతం కనిపిస్తారు. మన దగ్గ ర ఇలా ఎప్పుడు చూస్తామా అనుకునేవాణ్ణి. తెలుగులో హీరోయిన్లుగా మాత్రమే వస్తున్నారు. అన్ని శాఖల్లోకి మహిళలులు రావాలి. ఆ రోజులు త్వరలో వస్తాయనుకుంటున్నా. దర్శకురాలిగా పరిచ అవుతున్న లక్ష్మీ సౌజన్యకి ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమాకి విశాల్‌, తమన్‌ మంచి సంగీతం అందించారు. ఇద్దరు సంగీత దర్శకులు కలిసి పని చేయడానికి ఇగో అడ్డు వస్తుంది. అలాంటివేమీ లేకుండా వీరిద్దరూ మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారు. గీతా ఆర్ట్స్‌ తర్వాత నేను సొంత సంస్థగా భావించే బ్యానర్‌ ఇది. ‘జెర్సీ’కి జాతీయ అవార్డు అందుకున్నందుకు నాగవంశీకి థ్యాంక్స్‌’’ అన్నారు’’ అని అన్నారు.

Icon Star Allu Arjun speech 'Varudu Kaavalenu' PreRelease Event - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics