Icon Star Allu Arjun Interview about ‘Pushpa1’

Tuesday,December 14,2021 - 09:51 by Z_CLU

మరో మూడు రోజుల్లో పుష్ప రాజ్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చి రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సందర్భంగా మీడియాతో సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఆ విశేషాలు బన్నీ మాటల్లోనే...

 

23 నెలల తర్వాత 

'అల వైకుంఠపురములో' రిలీజై దాదాపు రెండేళ్లవుతోంది.  మళ్ళీ ఇరవై మూడు నెలలు తర్వాత ఈ సినిమాతో వస్తున్నాను. మధ్యలో కోవిడ్ వచ్చింది. ఆ గ్యాప్ లో ఎక్కువగా వీడియో కాల్స్ చేసుకుంటూ సినిమా గురించి డిస్కషన్ చేసే వాళ్ళం. ఆ టైంలో హోం వర్క్ బాగా చేసుకోగలిగాం. ఆ టైం అంతా ప్రేపరేషన్ కోసం వాడుకున్నాం.

మారేడుమిల్లిలో... చాలా కష్టం 

ఈ సినిమా షూటింగ్ లో మేము చాలా కష్టపడింది మారేడుమిల్లి ఫారెస్ట్ షూట్ టైం. అక్కడ ఫారెస్ట్ లో షూట్ చేయడం చాలా కష్టమనిపించింది. పురుగులు బాగా ఉండేవి. అవి వంటి మీద పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వర్క్ చేయాల్సి వచ్చింది. రెండు వందల కార్లు , అలాగే లారీలు ఇలా అన్నీ ఉండేవి. కొన్ని సార్లు వర్షం పడుతుండేది.  ఇలా చాలా ఇబ్బందుల మధ్య వర్క్ చేసేవాళ్ళం.

అవన్నీ రీ సెర్చ్ చేశారు

ఈ కథ చెప్పేటప్పుటే సుకుమార్ అండ్ టీం చాలా రీ సెర్చ్ చేశారని అర్థమైంది. రియల్ స్మగ్లర్స్ చెప్పిన విషయాలతో కొన్ని వీడియోస్ ఉన్నాయి. నేను కూడా కొన్ని వీడియోస్ చూశాను. వాళ్ళు ఎలా మాట్లాడతారు ? ఎలా బిహేవియర్ చేస్తారనేది బాగా హోం వర్క్ చేశాను. మూడు సార్లు లుక్ టెస్ట్ జరిగింది. ముంబై నుండి ఒక స్పెషల్ టీం వచ్చి నా లుక్ డిజైన్ చేశారు.రెండు సార్లు కుదరలేదు, మూడో సారి సెట్ అయింది. సినిమాలో మూడు లుక్స్ ఉంటాయి. కూలీ లుక్ , ట్రాన్స్ పోర్ట్ లుక్ , ఫైనల్ గా స్మగ్లర్ లుక్ ఇలా నా క్యారెక్టర్ లో మూడు వేరియేషన్స్ కనిపిస్తాయి. ఫైనల్ గా అందరం చాలా హోం వర్క్ చేశాం.

ఫిక్షనల్ స్టోరీ మాత్రమే 

సినిమా పూర్తి ఫిక్షన్ కథతో తెరకెక్కింది. ఎలాంటి రియల్ ఇన్సిడెంట్స్ కానీ సంఘటనలు కానీ కనిపించవు... ఉండవు.  శేషాచలం అడవి నేపథ్యంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద జరిగే కథ ఇది. అన్ని పాత్రలు క్రియేట్ చేసినవే తప్ప రియల్ క్యారెక్టర్స్ ఏమి లేవు. ఇది  'పుష్ప' అనే వ్యక్తి తాలూకు ప్రయాణంతో తెరకెక్కిన సినిమా.

'పుష్ప'తో అవి తెలుసుకున్నాను

'పుష్ప' సినిమా వలన నేను ఏదైనా నేర్చుకున్నాను. తెలుసుకున్నాను అంటే అది మేకప్ గురించే. ఇప్పటి వరకూ నాకు మేకప్ టెక్నిక్స్ తెలియవు. ఎప్పుడూ నాకు అవసరం రాలేదు. జెనరల్ గా ఎప్పుడూ కమర్షియల్ మేకప్ మాత్రమే వేసుకునే వాడిని. కానీ ఈ సినిమా కోసం  రెండు గంటల పాటు స్పెషల్ మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. దాన్ని తీయడానికి అరగంట పట్టేది. మేకప్ గురించి కాస్త డీటెయిల్ గా తెలుసుకున్నాను. అలాగే చిత్తూరు యాస నేర్చుకున్నాను. మనం మాట్లాడే దానికి వారు మాట్లాడే యాసకి చాలా తేడా ఉంటుంది. అది గమనించాను.

అందుకే ఆ లెవెల్ వరకూ నేర్చుకున్నా 

ఈ సినిమా కోసం చిత్తూరు యాస నేర్చుకున్నాను. సుకుమార్ గారు సెట్ లోకి వచ్చాక డైలాగ్స్ మారుస్తుంటారు. సో మనం ప్రిపేర్ అవ్వకపోతే దొరికెస్తాం. అప్పటికప్పుడు ఏది చెప్పినా, ఏం డైలాగ్ ఇచ్చినా చెప్పేసే లెవెల్ వరకూ నేర్చుకున్నాను. దాని వల్ల చిత్తూరు స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పడం చాలా ఈజీ అయిపోయింది. దాని కోసమే ఎక్కువగా ప్రిపేర్ అయ్యాను.

టైటిల్ మాత్రమే ఎనౌన్స్ చేద్దామనుకున్నాం

సినిమాకి 'పుష్ప' టైటిల్ అనుకుంటున్నా అని సుకుమార్ గారు నాతో చెప్పగానే బాగుంది అన్నాను. ఈ టైటిల్ నీకు నచ్చుద్దని నాకు తెలుసు బయట ఎవరికి చెప్పిన బాలేదు అంటారు. ఒక అమ్మాయి పేరు కదా.., కానీ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ కి సాఫ్ట్ పేరు పెడితే కొత్తగా ఉంటుందని మేమిద్దరం అనుకున్నాం. ముందు టైటిల్ ఎనౌన్స్ చేద్దాం అనుకున్నాం. కానీ ఫస్ట్ లుక్ తో పాటు రివీల్ చేస్తే బెటర్. లుక్ , టైటిల్ అన్నీ కొత్తగా అనిపిస్తాయని భావించి ఫస్ట్ లుక్ పోస్టర్ తో టైటిల్ చెప్పాం.

బెగినింగ్ స్టేజిలోనే ....

సినిమా బెగినింగ్ లోనే కథ అంతా ఒకే సినిమాలో చెప్పగలమా ? అనే డౌట్ వచ్చింది. ఆల్మోస్ట్ మూడున్నర గంటల పైనే రావొచ్చు. ఒకే సినిమాగా చెప్పలేమేమో ? అనుకున్నాం. సరే ట్రై చేద్దాం అని మొదలు పెట్టాం.  కానీ ప్రాసెస్ లో  ఇది రెండు భాగాలుగా చెప్పాల్సిన సినిమా అని అర్థం చేసుకొని రెండు పార్ట్స్ గా చేద్దామని ఫిక్స్ అయ్యాం.

ఇది నేల మాస్ 

ఇప్పటి వరకూ నేను మాస్ , ఊర మాస్ క్యారెక్టర్ చేశాను. కానీ పుష్ప రాజ్ అనేది నేల మాస్ అనొచ్చు. ఇంక ఇంతకంటే మాస్ చేయలేను అన్నట్టుగా చేశాను. రిలీజ్ తర్వాత మాస్ ఆడియన్స్ కి పుష్ప బాగా కనెక్ట్ అవుతాడు.

హడావుడి ... కారణం అదే

ఈ సినిమాను రెండు పార్ట్స్ గా చేద్దామని అనుకున్నప్పుడే ఒక్కో పార్ట్ ఒక్కో ఏడాదిలో రిలీజ్ చేయాలనుకున్నాం. అందుకే పార్ట్ 1 ని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ లోనే థియేటర్స్ లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి చాలా కష్టపడ్డాం. ఇప్పటికీ మా డైరెక్టర్ సుకుమార్ , మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇంకా వర్క్ చేస్తున్నారు. అందువల్లే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయారు. కానీ వారిద్దరితో కలిసి రిలీజ్ కి ఒక్కరోజు ముందైన ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తాను. లేదంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు.

ప్రమోషన్ ప్లాన్ ఇదే 

ఈరోజు చెన్నై వెళ్లాను. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు ఉదయం బెంగుళూరు, సాయంత్రం కొచ్చి లో అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నాను. ఎల్లుండి ముంబైలో ప్రెస్ మీట్ అనుకుంటున్నాం. తర్వాత  సుక్కు , దేవిలతో  కలిసి ఏదైనా ఇంటరాక్షన్ చేయాలని మనసులో ఉంది. ప్రస్తుతానికి ఇవే ప్లాన్స్.

రాజమౌళి గారిని సినిమా చేయమని అడిగా

రాజమౌళి గారితో వర్క్ చేయాలని ప్రతీ హీరోకి ఉంటుంది. నాకు కూడా ఉంది. మీతో సినిమా చేయాలనుందని ఆయన్ని అడిగా. తప్పకుండా నేను చేయాలనుకునే ప్రామిసింగ్ హీరోల్లో నువ్వు ఒకడివి తప్పకుండా చేద్దాం అన్నారు. కచ్చితంగా ఏదో ఒకరోజు ఇద్దరం కలిసి సినిమా చేస్తామని ఆశిస్తున్నాను.

బ్రేక్ తీసుకోవాల్సిందే 

పుష్ప పార్ట్ కి సంబంధించి చాలా షూట్ ఉంది. కానీ ప్రస్తుతానికి కొన్ని నెలలు బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 షూట్ స్టార్ట్ చేస్తాను.

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics