Hot Topic : Sukumar to direct Megastar Chiranjeevi

Wednesday,February 23,2022 - 05:12 by Z_CLU

కొన్ని కాంబినేషన్ సినిమాలు ఎప్పటి నుండో ఫ్యాన్స్ ని ఊరిస్తూ వస్తున్నాయి. అందులో చిరు -సుక్కు కాంబో ఒకటి. అవును మెగా స్టార్ తో సుకుమార్ సినిమా అంటూ ఎప్పటి నుండో ఓ న్యూస్ నానుతూ వస్తుంది. 'రంగస్థలం' తర్వాత వీరిద్దరూ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారంటూ ఆ మధ్య ఈ కాంబో సినిమా వార్తల్లో నిలిచింది. కానీ ఎందుకో మెటిరియలైజ్ అవ్వలేదు.

అయితే ఎట్టకేలకు ఈ కాంబో గురించి ఓ అప్ డేట్ వచ్చింది. ఇటివలే సుకుమార్ మెగాస్టార్ ని డైరెక్ట్ చేయాలనే తన డ్రీం ఎట్టకేలకు తీరనుందని చిరుకి ఓ ఇద్దరు వ్యక్తులతో కలిసి బొకే ఇస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ఈ కాంబో సినిమా హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో సుకుమార్ తో మెగాస్టార్ సినిమా అంటూ హ్యాష్ ట్యాగ్స్ తో పోస్టులు పెట్టేసుకున్నారు ఫ్యాన్స్.

కానీ ఈ కాంబో న్యూస్ వెనక నిజం ఏమిటంటే ? సుకుమార్ మెగాస్టార్ ని డైరెక్ట్ చేయబోతున్నది నిజమే కానీ... అది సినిమా కాదు. చిరుతో ఓ కమర్షియల్ యాడ్ తీయబోతున్నాడు సుక్కు. రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఓ యాడ్ కోసం చిరుని ఒప్పించి ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు.  అందులో భాగంగానే రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్స్ కి చిరుతో మీటింగ్ ఏర్పాటు చేసి మెగాస్టార్ కి బొకే ఇచ్చి ఫోటో దిగాడు. గతంలో కూడా సైలెంట్ గా కొన్ని యాడ్స్ చేశాడు సుకుమార్.

chiranjeevi_to-team-up-sukumar_for-commercial-ad-zeecinemalu

లేటెస్ట్ గా బన్నీతో ఓ విద్యా సంస్థకి యాడ్ చేసి ఇచ్చాడు. కానీ ఇప్పుడు చేయబోయేది మెగా యాడ్. మరి ఈ యాడ్ లో మెగాస్టార్ ని సుకుమార్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో ఎలాంటి కంటెంట్ తో చేస్తాడో ? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఎట్టకేలకు ఈ యాడ్ తో చిరుని డైరెక్ట్ చేశాననే డ్రీం నేరవేర్చుకోబోతున్నాడు సుకుమార్.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics