Prashanth Neel remakes ‘Ugramm’ with Prabhas ?

Tuesday,December 01,2020 - 01:13 by Z_CLU

Prabhas - Prashanth Neel కాంబో ఫిక్సయింది. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటన రానుంది. అయితే ఈ ఇద్దరు కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేస్తారనే టాక్ నడుస్తుంది. ప్రశాంత్ తన మొదటి సినిమా 'Ugramm' ను ప్రభాస్ తో తెలుగులో రీమేక్ చేస్తాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది.

ఎప్పటి నుండో కొందరు స్టార్ హీరోల చుట్టూ తిరుగుతున్న ఉగ్రమ్ కథ ఎట్టకేలకు ప్రభాస్ చేతిలో పడిందని త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఇంకా ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కాంబో అఫీషియల్ గా ఎనౌన్స్ అవ్వలేదు కానీ అప్పుడే ఈ సినిమాపై డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి.

ప్రశాంత్ కూడా KGF 2 షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ సినిమా చేయాల్సి ఉంది. మరి ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు ఉంటుంది నిజంగానే ఇద్దరూ ఉగ్రమ్ రీమేక్ తో రాబోతున్నారా అనే డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.