Hot Topic : NBK playing a important role in Mahesh, Rajamouli’s film ?

Monday,March 14,2022 - 12:05 by Z_CLU

ప్రస్తుతం RRR సినిమా రిలీజ్ హడావుడిలో ఉన్న రాజమౌళి నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే ఓ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాడట జక్కన్న. మహేష్ ని కొత్తగా ప్రెజెంట్ చేసేలా క్యారెక్టరైజేషన్ కూడా రాసుకున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ డిస్కషన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా గురించి ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది.

మహేష్ తో రాజమౌళి తీస్తున్న సినిమాలో నందమూరి బాలయ్య కూడా ఉంటారనేది ఆ న్యూస్. అయితే ఇది గెస్ట్ రోల్ లా కాకుండా దాదాపు నలభై నిమిషాల పాటు ఉంటుందని టాక్. ఈ మేరకు మహేష్, బాలయ్య లతో రాజమౌళి ఓ డిస్కషన్ కూడా జరిపారని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ ఇటీవలే బాలయ్య టాక్ షో లో పాల్గొన్నాడు. వీరిద్దరి మధ్య బాండింగ్ చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అదే షోకి రాజమౌళి కూడా వెళ్లారు. రాజమౌళి ని నాతో సినిమా ఎప్పుడు చేస్తారు ? అని స్ట్రెయిట్ గా ఆడిగేశాడు బాలయ్య. దానికి రాజమౌళి కూడా సుముఖంగా జవాబిచ్చాడు.

అయితే ఇప్పుడు మహేష్ , రాజమౌళి సినిమాలో బాలయ్య అనే ప్రచారానికి టాక్ షో లో కన్వర్జేషన్ కూడా బలం చేకూరుస్తుంది.  బాలయ్యకి ఓ నెగిటివ్ రోల్ చేయాలని ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. మరి మహేష్ సినిమాలో అలాంటి రోల్ ఏమైనా చేయబోతున్నారా ? అనే డౌట్ కూడా రైజ్ అవుతుంది. ఈ విషయంపై ఇంకా మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు కానీ... మహేష్ , బాలయ్య కాంబో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో నిజమెంతో ? రాజమౌళి చెప్పే వరకూ వేచి చూడాల్సిందే.

 
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics