Hot Topic : Jr NTR dual role in ‘NTR30’ ?

Thursday,March 31,2022 - 06:34 by Z_CLU

ప్రస్తుతం చరణ్ తో కలిసి RRR సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న ఎన్టీఆర్ నెక్స్ట్ కొరటాల శివ డైరెక్షన్ లో తన 30వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే నెల ఏప్రిల్ లో గ్రాండ్ గా లాంచ్ అవ్వనుంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ గాసిప్ బయటికొచ్చింది.

సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేయనున్నాడనేది ఆ న్యూస్. కొరటాల శివ తారక్ కోసం రెండు పవర్ ఫుల్ రోల్స్ క్రియేట్ చేసుకున్నాడని ఆ రోల్స్ రెండూ చాలా డిఫరెంట్ గా ఉంటాయని టాక్ వినబడుతుంది. గతంలో 'ఆంధ్రావాలా', 'అదుర్స్' సినిమాల్లో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేశాడు. 'జై లవకుశ' లో ఏకంగా మూడు పాత్రల్లో కనిపించి మెస్మరైజ్ చేశాడు కూడా. మళ్ళీ ఇప్పుడు కొరటాల శివ సినిమాతో డబుల్ ఎంటర్టైన్ మెంట్ ఇవ్వనున్నాడని అంటున్నారు.

ప్రస్తుతానికి ఈ గాసిప్ సోషల్ మీడియాలో గట్టిగా చక్కర్లు కొడుతుంది. మేకర్స్ మాత్రం దీనిపై స్పందించలేదు. మరి తారక్ డ్యుయల్ రోల్ చేస్తున్నది నిజమేనా ? లేదా ఇది జస్ట్ రూమర్ ఏనా ? తెలియాల్సి ఉంది. యువసుధ ఆర్ట్స్ బేనర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ కన్ఫర్మ్ అవ్వలేదు. అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చే అవకాశం ఉంది.

  Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics