Heroine Shruthi Haasan interview

Friday,October 22,2021 - 10:09 by Z_CLU

Heroine Shruthi Haasan interview

ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం శృతిహాసన్ స్టయిల్. ఇప్పటికే చాలా విషయాలు బయటపెట్టిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా మరికొన్ని సంగతుల్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ముందుకు సాగడమే తన జీవన సూత్రం అంటున్న శృతి.. తన బ్యూటీ సీక్రెట్స్ తో పాటు లైఫ్ సీక్రెట్స్ బయటపెట్టింది.

- నీ లైఫ్ కు సంబంధించి మంచి థీమ్ సాంగ్ ఏది?

ది జిమి హెన్డ్రిక్స్ పాడిన ఫాక్సీ లేడీ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాట వింటున్న ప్రతి సారి నా జీవితం చాలా బాగుందని అనిపిస్తుంది.

- నీ హెయిర్ సీక్రెట్ ఏంటి?

ఎలాంటి సీక్రెట్ లేదు. అది జీన్స్ తో వచ్చింది. మా అమ్మ-నాన్నకు మంచి హెయిర్ ఉంది కాబట్టి నాక్కూడా వచ్చింది. దాన్ని నేను మెయింటైన్ చేస్తున్నానంతే. ప్రతి రోజూ ఆయిల్ పెడతాను. ఏళ్లుగా ఇదే ఫాలో అవుతున్నాను. వ్యాయామం చేసిన ప్రతిసారి తలస్నానం చేయను, కానీ షూట్ పూర్తయిన ప్రతిసారి తలస్నానం చేస్తాను. మిగతా రోజుల్లో హెయిర్ రీఫ్రెషర్ వాడతాను.

- నీ జీవన సూత్రం

ప్రతి మలుపులో ఏదో ఒకటి నేర్చుకోవాలి. పరిస్థితులతో యుద్ధం చేసి గెలవాలి. ఏం జరిగినా, ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగడమే నా లైఫ్ మంత్ర.

- ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావ్?

నిజం చెప్పాలంటే నేను పెళ్లి చేసుకోను. అయినా ఇప్పుడది ముఖ్యం కాదు. 2021లో చాలా ఇష్యూస్ ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. చాలా బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి. నా పెళ్లి టాపిక్ కాదు.

 

- మనసుతో నిర్ణయాలు తీసుకుంటావా.. మెదడుతోనా?

సందర్భం బట్టి మారిపోతుంది. నా మనసు చెప్పేది వింటాను కానీ 90శాతం నిర్ణయాలు మాత్రం మెదడు పెట్టి ఆలోచించి తీసుకుంటాను.

- ప్రతిసారి బ్లాక్ డ్రెస్ లోనే ఎందుకు కనిపిస్తావ్?

ఎందుకంటే నాకు నలుపు రంగు ఇష్టం. అది నా హ్యాపీ కలర్. ఆ కలర్ వేసుకుంటే మనసుకు బాగుంటుంది.

 

- రీసెంట్ గా చేసిన అతి చెత్త వాదన?

ఈమధ్య ఒకరితో మాట్లాడాను. కరోనా నిజంగానే ఉందని, అది సోకితే చాలా ప్రమాదమని చెప్పడానికి చాలా కష్టపడ్డాను. మాస్క్ వేసుకోవాల్సిందే అని గట్టిగా చెప్పాను. ఎందుకంటే, కరోనా ఉందని వాళ్లు నమ్మడం లేదు.

 

- జీవితంలో అతి పెద్ద భయం

పాములంటే నాకు చచ్చేంత భయం. కళ్ల ముందు మాత్రమే కాదు, అవి కలలోకి వచ్చినా తట్టుకోలేను.

Shruti-Haasan-–-A-doctor

- ఫుడ్ లేదా సెక్స్ లో ఏది లేకుండా ఉండలేవు?

ఇదేం ప్రశ్న. భోజనం లేకుండా ఎవరైనా ఉండగలరా? ఫుడ్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు? సెక్స్ లేకపోతే చచ్చిపోం. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే.. సెక్స్ కంటే ఫుడ్ చాలా ముఖ్యం.

- వాదించేటప్పుడు అభిప్రాయం చెబుతారా? సైలెంట్ గా ఉంటారా?

మనం చెప్పేది ఎదుటి వ్యక్తి వింటున్నప్పుడు అభిప్రాయం చెబుతాను. అలాంటి పరిస్థితి లేనప్పుడు సైలెంట్ గా ఉండడం బెటర్.

- చెడు స్నేహాలపై నీ అభిప్రాయం

చెడు స్నేహాలు మన శరీరాన్ని, బుర్రని పాడుచేసినంతగా.. ఈ భూమ్మీద ఏదీ పాడు చేయలేదు. చెత్త రిలేషన్ షిప్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics