Hero Vishwak Sen Interview about ‘Ori Devuda’

Thursday,October 20,2022 - 05:57 by Z_CLU

అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన 'ఓరి దేవుడా' రేపే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. విక్టరీ వెంకటేష్ గాడ్ కేరెక్టర్ లో కనిపించనున్న ఈ సినిమా గురించి హీరో విశ్వక్ సేన్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు విశ్వక్ మాటల్లోనే...

వంశీ గారి ద్వారానే ...

పీవీపీ సినిమా బేనర్ పై 'ఓమై కడవులే' సినిమాను రీమేక్ చేస్తున్నాం.. మిమ్మల్ని హీరోగా  అనుకుంటున్నామని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ వచ్చి చెప్పారు. అశ్వత్ మారిముత్తునే డైరెక్టర్ అని చెప్పగానే వెంటనే ఒకే చేసేశాను. 2020 లో అశోక వనంలో అర్జున కళ్యాణం కంటే ముందే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. కానీ మధ్యలో గాడ్ కేరెక్టర్ కోసం కొన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. అలాగే ఒక ఫ్యామిలీ సినిమా తర్వాతే ఇది థియేటర్స్ లోకి వస్తే బాగుంటుందని భావించాను. అందుకే అర్జున కళ్యాణం ముందుగా ఫినిష్ చేసేసి ఆ తర్వాత ఈ సినిమా మొదలు పెట్టాను.

అశ్వత్ ..బెటర్ మెంట్ తో ..

ఒక రీమేక్ సినిమాను ఒరిజినల్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తేనే బాగుంటుంది. అందులో మిస్ అయ్యిందేంటో తెలుసుకొని బెటర్ మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అశ్వత్ ఈ రీమేక్ ను కొంచెం బెటర్ మెంట్ తీశాడు. ముఖ్యంగా ఒక సాంగ్ యాడ్ చేయడం, పెద్ద కోర్టు సెట్ ఇలా కొన్ని మార్పులు చేశాడు. సో అశ్వత్ ఈ సినిమాకు బెస్ట్ ఇచ్చాడు.

అనిరుద్ డబ్బులు తీసుకోడు 

ఈ సినిమాలో ఒక సాంగ్ అనిరుద్ తో పాదిస్తే బాగుంటుందని మ్యూజిక్ డైరెక్ట్ అనుకున్నాడు. తను కూడా అడిగిన వెంటనే ఫ్రెండ్ కోసం పాడేశాడు. అనిరుద్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ కి చాలా సాంగ్స్ పాడాడు. ఎప్పుడూ డబ్బులు తీసుకోడు. ఫ్రెండ్లీ గా పాడేసి వెళ్ళిపోతాడు. అది చాలా గొప్ప విషయం. మా సినిమాకు తన సాంగ్ చాలా ప్లస్ అయ్యింది.

వెంకటేష్ గారే అనుకున్నాం 

ఈ సినిమా నేను సైన్ చేసినప్పుడు గాడ్ కేరెక్టర్ కి వెంకటేష్ గారి పేరే ఉంది. కానీ మధ్యలో వేరే యాక్టర్స్ ని కూడా అనుకున్నారు. కానీ ఫైనల్ గా మొదటి నుండి అనుకున్న వెంకటేష్ గారే ఈ కేరెక్టర్ చేశారు. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. మనం ఒక హిట్ సినిమా తీయాలని ప్రయత్నించినా సాధ్యం అవ్వదని , అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుందని ఆయన చెప్పారు. ఆయన నాలుగు రోజులు వర్క్ చేశారు. ఆయనతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఓ బెస్ట్ మూమెంట్.

చరణ్ గారిని కలవడం ఇదే మొదటి సారి 

రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాం చరణ్ గారు రావాడం, వచ్చి నా గురించి మాట్లాడటం చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. బేసిక్ గా ఆయనను ఎప్పుడూ కలవలేదు. అదే మొదటి సారి. ఆయన మా సినిమాను సపోర్ట్ చేసి నా గురించి మాట్లాడటం గ్రేట్ మూమెంట్ అనిపించింది. రాం చరణ్ గారికి స్పెషల్ థాంక్స్.

దీపావళి రిలీజ్ ... ఆ స్కోప్ ఉంది 

రేపు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఓరి దేవుడా ఒకటి . దీపావళి కి ఆ స్కోప్ ఉంది. పండుగ కాబట్టి బాగుంటే నాలుగు ఆడతాయి. మొన్నీ మధ్యే ఒకే రోజు రిలీజైన 'బింబిసార', 'సీతా రామం' రెండూ బాగానే ఆడాయి. మా సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాం. కచ్చితంగా ఒరిజినల్ చూసిన వారికి అలాగే చూడని వారికి అందరికీ నచ్చుతుంది.

నవంబర్ నుండి షూటింగ్ మొదలు 

నా నెక్స్ట్ సినిమా 'దాస్ కా దమ్కి' షూటింగ్ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాను. అలాగే అర్జున్ గారి డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా షూటింగ్ నవంబర్ నుండి మొదలుపెడతాను. నేను లేకుండా జగపతి బాబు గారు , ఐశ్వర్య లతో ఓ ఐదు షూట్ చేశారు. త్వరలోనే ఇంకో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేస్తాను. ఫలక్ నుమా దాస్ 2 పనులు జరుగుతున్నాయి. అది మన హైదరాబాద్ కథ కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది. అందుకే ఆ సినిమాను పాన్ ఇండియా మూవీగా చేసే ఆలోచనలో ఉన్నాను.

* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics