Hero Sumanth Ashwin to marry Deepika on Feb 13

Wednesday,February 03,2021 - 12:27 by Z_CLU

టాలీవుడ్ లో మరో హీరో బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఇప్పటికే రానా, నితిన్, నిఖిల్ లాంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకొని మ్యారీడ్ లైఫ్ లోకి అడుగుపెట్టారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సుమంత్ అశ్విన్ కూడా చేరుతున్నాడు. మరో 10 రోజుల్లో ఈ హీరో పెళ్లి.

నటుడు, నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్.. ఈనెల 13న ఓ ఇంటివాడు కాబోతున్నాడు. దీపిక మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్ట్ లో సుమంత్ పెళ్లి సింపుల్ అండ్ స్వీట్ గా జరగనుంది.

ఇది ప్రేమ పెళ్లి కాదు. కొడుకు కోసం స్వయంగా ఎమ్మెస్ రాజు చూసిన సంబంధం ఇది. అమ్మాయి అమెరికాలో డాక్టర్ కోర్స్ చేసిందట. అలా సరిగ్గా ప్రేమికుల రోజుకు ఒక రోజు ముందు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నాడు సుమంత్.

తూనీగ తూనీగ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. లవర్స్ కేరింత, హ్యాపీ వెడ్డింగ్ లాంటి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'ఇదే మా కథ' సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కు రెడీ అయింది.