Hero Sree Vishnu New Movie Launch under Lucky Media
Saturday,January 09,2021 - 12:55 by Z_CLU
విలక్షణ కథలతో, డిఫరెంట్ చిత్రాలతో, అభినయానికి అవకాశం ఉన్న పాత్రలతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు.. ఒకదాని తర్వాత ఒకటిగా ఇంటరెస్టింగ్ సినిమాలకు సంతకం చేస్తూ వస్తున్నాడు.
లేటెస్ట్గా శ్రీవిష్ణు కథానాయకుడిగా లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రదీప్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్ క్లాప్ నివ్వగా, నిర్మాత శిరీష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సన్నివేశానికి శ్రీరామ్ గౌరవ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందే ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని రోల్లో శ్రీవిష్ణు కనిపించనున్నాడు.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తుండగా, శివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మిగతా టెక్నీషియన్ల పేర్లను త్వరలో వెల్లడించనున్నారు.
శ్రీవిష్ణు నటిస్తోన్న 'రాజ రాజ చోళ' సినిమా షూటింగ్ పూర్తవగా, 'గాలి సంపత్' చిత్రం, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న టైటిల్ ఖరారు చేయని సినిమా షూటింగ్‌లు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి.