Hero Siddharth Speech at Takkar Movie

Monday,June 05,2023 - 12:17 by Z_CLU

నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ 'టక్కర్'. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ , తరుణ్ భాస్కర్ , వెంకటేష్ మరియు  ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ..." అందరికి నమస్కారం, టక్కర్ సినిమా జూన్ 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను మంచి స్కేల్ లో తీశారు. ఇది ఒక యాక్షన్ ఫిల్మ్ ఈ యాక్షన్ స్టోరీ మధ్యలో ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ ను చూపించారు కార్తీక్ జి. క్రిష్ గారు.ఈ సినిమాలో లవర్ బాయ్ రగ్గడ్ గా ఉంటే ఎలా ఉంటుందో చూపించారు.

ఇక్కడికి వచ్చిన అతిధులు అందరికి థాంక్యూ సో మచ్. నేను రామానాయుడు గారితో చాలా సార్లు మాట్లాడాను. నాకు సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. సురేష్ బాబు గారి వచ్చి ఈ టీం ను బ్లేస్ చేసినందుకు థాంక్యూ సో మచ్. తెలుగు సాహిత్యం , తెలుగు కవిత్వం చూసి , చదివి అది నా లోపలకి వెళ్ళిపోయింది. సో నేను చెప్పిన చెప్పకపోయినా తెలుగు బిడ్డే. జూన్ 9న టక్కర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా 100% అలరిస్తుంది. త్వరలో నేను 6 సినిమాలు రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. టెక్నీకల్ టీం కి థాంక్యూ సో మచ్. దివ్యాంశ కి ఈ సినిమా తరువాత ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సిద్దు ఎప్పుడు చేస్తారు అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా అన్నారు.