Hero Naga Shaurya Interview about Lakshya

Thursday,December 09,2021 - 04:12 by Z_CLU

వరుసగా లవ్ స్టోరీస్ తో లవర్ బాయ్ ఇమేజ్ తో ముందుకెళ్తున్న నాగ శౌర్య స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో 'లక్ష్య' అనే సినిమా చేశాడు. ఈ సినిమా రేపే రిలీజ్ అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మీడియాతో ముచ్చటించాడు శౌర్య. ఆ విశేషాలు నాగ శౌర్య మాటల్లోనే...

మూడున్నర గంటల నెరేషన్ 

సునీల్ గారు ఒకరోజు ఫోన్ చేసి ఒక స్క్రిప్ట్ విన్నాను బాగుంది. నువ్వు ఒకసారి విను అని అన్నారు. ఆ మరుసటి రోజు సంతోష్ ని పంపించారు. తను మూడున్నర గంటల పాటు స్క్రిప్ట్ నెరేట్ చేశాడు. కథ చెప్తుండగానే తన విజన్ , రైటింగ్ కి ఎట్రాక్ట్ అయ్యాను. వెంటనే  సినిమా చేస్తున్నాం అని చెప్పేసి ఫైనల్ చేయడం జరిగింది. ఆ తర్వాత తను డైరెక్ట్ చేసిన 'సుబ్రహ్మణ్య పురం' సినిమా చూశాను.

కొన్ని కథలు వచ్చాయి కానీ... 

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ మంచి సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా. కొన్ని కథలు వచ్చాయి విన్నాను. కానీ క్రికెట్ మీద మిగతా స్పోర్ట్స్ మీద కథలు విన్నాను. అవేవి ఎగ్జైటింగ్ గా అనిపించలేదు. ఆర్చెరీ బ్యాక్ డ్రాప్ అనగానే ఎగ్జైట్ అయ్యాను.

మూడు రోజుల్లోనే 

ఈ సినిమా కోసం ఆర్చెరీ లో ట్రైనింగ్ తీస్సుకున్నా. కేవలం మూడు రోజుల్లోనే నేర్చుకున్నా. చదువు అంటే కష్టం కానీ మిగతావన్నీ యిట్టె పట్టేస్తా (నవ్వుతూ). నిజానికి ఇది అందరికీ తెలిసిన ఆటే. మన పురాణాల నుండి చూస్తూనే ఉన్నాం. ఎప్పటి నుండో మన తెలుగు సినిమాల్లోకూడా చూస్తుందే. తాజాగా RRR లో రామ్ చరణ్ కూడా బాణం పట్టుకొని కనిపించాడు. నేర్పరితనం , ముందు చూపుతో ఆడే ఆట ఇది. అందుకే దీన్ని విలు విద్య అంటారు. కాకపోతే దీని మీద స్పోర్ట్స్ నేపథ్యంతో పూర్తి స్తాయి సినిమా రాలేదు. ఇండియాలో ఆర్చెరీ మీద వస్తున్న మొదటి సినిమా ఇది.

ఇంకా చాలా సినిమాలు చేస్తాను 

ఈ సినిమాకు కావాల్సిందల్లా ఇచ్చి దీన్ని మరోస్తాయికి తీసుకెళ్ళారు మా నిర్మాతలు.  శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ LLP అంటే నా సొంత బేనర్ తో సమానం. ఈ సినిమాతో మొదలైన మా జర్నీ ఇకపై కొనసాగుతూనే ఉంటుంది. ఈ బేనర్ లో మరిన్ని సినిమాలు చేస్తాను.

కొత్త శౌర్యని చూస్తారు 

కథ విన్నప్పుడే నా నుండి ఒక కొత్తదనం చూపించాలనుకున్నాను. అందుకోసమే కంప్లీట్ గా కథకి కావాల్సిన విధంగా మారాను. ఎంతో కష్టపడి ట్రైనింగ్ తీసుకొని సిక్స్ ప్యాక్ చేశాను. ఎందుకంటే ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ కి మన సైడ్ నుండి బెస్ట్ ఇవ్వాలి. ఫ్యామిలీ ఎమోషన్స్ , స్పోర్ట్స్ డ్రామా , కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ బాగా కుదిరిన కథ ఇది. ఈ కథ నాకు రావడం అదృష్టం. ఇలాంటి కథలు వచ్చినప్పుడు యాక్టర్స్ ఎవరైనా ఒక స్టెప్ ముందుకెళ్ళి బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తారు. నేనూ అదే చేశాను. ఈ సినిమాతో కొత్త శౌర్య ని చూస్తారు.

వాటర్ తాగకుండా 

ఈ సినిమా కోసం మూడు రోజుల పాటు వాటర్ తాగలేదు. నరాలు కనిపించాలంటే మన బాడీ డ్రై అవ్వాలి. అలా అవ్వాలంటే వొంట్లో వాటర్ లెవల్స్ ఉండకూడదు. అప్పుడే ఆ నరాలు బయటికి కనిపిస్తాయి. అలా కనిపించడం కోసం మూడు రోజులు నీళ్ళు తాగలేదు. ఒక వైపు సిక్స్ ప్యాక్ కోసం తక్కువ ఫుడ్ తీసుకుంటూ వాటర్ తాగకుండా కొంచెం కష్టపడాల్సి వచ్చింది. నీళ్ళు తాగకుండా ఉంటూ కష్టపడి చేసింది ప్రేక్షకుల కోసమే. సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులు పార్థు క్యారెక్టర్ గురించి ఎక్కువగా  మాట్లాడి శౌర్య బెస్ట్ ఇచ్చాడు అనుకుంటే చాలు. పడిన కష్టమంతా మర్చిపోతాను.

 

గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది

నా సొంత బేనర్ లో చేస్తున్న సినిమా దాదాపు పూర్తయింది. మరో రెండు నెలల్లోనే ఆ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకొస్తాను. అలాగే అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో నేను చేస్తున్న 'ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి ' నలబై శాతం పూర్తయింది. పూర్తి కావడానికి ఇంకో ఏడాది పడుతుంది. అది నా సినిమా అని నేను గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందని నా నమ్మకం.

  Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics