Hero Karthi speech at ‘Sardar’ PreRelease Event

Thursday,October 20,2022 - 11:36 by Z_CLU

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. సర్దార్లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో కార్తి  'నేనే సేనాపతి' పాటకు వేదికపై మాస్ డ్యాన్స్ చేయడం అందరినీ అలరించింది.

హీరో కార్తి మాట్లాడుతూ.. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నాగార్జున అన్నయ్య ఈ ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. అలాగే ఈ సినిమాని నాగార్జున గారు తెలుగు విడుదల చేయడం చాలా థ్రిల్ గా వుంది. సర్దార్ నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ. తొలిసారి తండ్రి కొడుకులుగా నటించాను. ఇందులో స్పై పాత్ర చాలా స్పెషల్. సర్దార్ గ్రేట్ హీరో. ఏమీ ఆశించకుండా దేశం కోసం పని చేసిన హీరో. ఆ పాత్ర చేసినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను. పోలీస్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఈ జనరేషన్ కు తగ్గట్టుగా వుంటుంది. ఒక సినిమాలో రెండు జనరేషన్లు చూపించడం ఒక సవాల్. ఇది ఇండియన్ స్పై థ్రిల్లర్. అభిమన్యుడు ఫేం పిఎస్ మిత్రన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. అభిమన్యుడులో డిజిటల్ క్రైమ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లే ఇందులో కూడా మన కళ్ళ ముందు వుండి, మనం పెద్దగా పట్టించుకొని ఒక ముఖ్యమైన విషయాన్ని చూపించారు. సర్దార్ లో అది గొప్ప సర్ ప్రైజ్ గా వుంటుంది. రాశి ఖన్నా, రజీషా, లైలా అద్భుతంగా నటించారు. జార్జ్ కెమరా పనితనం బ్రిలియంట్ గా వుంటుంది. జీవి పప్రకాష్ కుమార్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు. నా కెరీర్ లో బిగ్ బడ్జెట్ చిత్రమిది. దాదాపు పాన్ ఇండియా షూట్ చేశాం. దీపావళి కి ఖైధీ సినిమా వచ్చింది. ఈ దీపావళికి ఒక పండగలా క్రాకర్ లా సర్దార్ సినిమా రాబోతుంది. అక్టోబర్ 21న సర్దార్ వస్తోంది. అందరూ తప్పకుండా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.

  *Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics