Hero Adivi Sesh Interview about ‘HIT 2’

Thursday,December 01,2022 - 06:34 by Z_CLU

అడివి శేష్ 'హిట్ 2' రేపే గ్రాండ్ గా రిలీజవుతుంది. వాల్ పోస్టర్ సినిమా బేనర్ పై నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాణంలో హిట్ ఫ్రాంచైజ్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. సినిమా రిలీజ్ సందర్భంగా హీరో శేష్ మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు శేష్ మాటల్లోనే...

విశ్వక్ కి ఓకె నా అడిగా 

నాని నాకు కాల్ చేసి హిట్ 2 కథ ఉంది నువ్వైతే బాగుంటుంది పోలీస్ కేరెక్టర్ అన్నాడు. ఫ్రాంచైజ్ ఆ ? విశ్వక్ కి ఓకె నా ? అని అడిగాను. తనకి ఓకె విశ్వక్ కూడా మళ్ళీ ఓ హిట్ ఫ్రాంచైజ్ కనిపిస్తాడు. సిరీస్ లా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. అప్పటికి విశ్వక్ నాకు పరిచయం లేదు. తర్వాత తను మా ప్రమోషన్ పోస్టర్స్ ని షేర్ చేస్తూ వచ్చాడు. రీసెంట్ గా ఈవెంట్ కి రమ్మని పిలవడానికి కాల్ చేశాను. ఆల్రెడీ నాని , శైలేష్ చెప్పారు బ్రో అన్నాడు.

హిట్ 2... కచ్చితంగా థ్రిల్ కలిగిస్తుంది 

హిట్ ఆడియన్స్ ని థ్రిల్ చేసి మెప్పించింది. హిట్ 2 కూడా కచ్చితంగా థ్రిల్ చేసి మెప్పిస్తుంది. సెకండాఫ్ లో సీరియస్ గా సాగే స్క్రీన్ ప్లే , ఆసక్తిగా నడిచే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

ఇంటర్వెల్ పెట్టకూడదు 

బేసిక్ గా హిట్ 2 కి ఇంటర్వెల్ ఉండకూడదు. కానీ థియేటర్స్ వాళ్ళు ఒప్పుకోరు కదా ఒక వేళ మనం ఇంటర్వెల్ వెయ్యకపోయినా కట్ చేసి బ్రేక్ ఇచ్చేస్తారు. క్యాంటిన్ వాళ్ళు కూడా అమ్ముకోవాలి కదా(నవ్వుతూ).

100 పాయింట్ దగ్గర జడ్జ్ చేయాల్సిన మూవీ 

హిట్ 2 సున్నా నుండి 40 పాయింట్ వరకూ ఒకలా ఉంటే 40 నుండి 100 పాయింట్ వరకూ గ్రిప్పింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది 100 పాయింట్ దగ్గర జడ్జ్ చేయాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కేసులేం ఉంటాయనుకునే కేడీ , అతని లవ్ స్టోరీ , ఫ్యామిలీ ఇలా సాగుతుంది. సడెన్ గా ఓ ఇన్సిడెంట్ జరుగుతుంది అక్కడి నుండి సినిమా సీరియస్ గా సాగుతుంది.

నాకు డౌట్స్ ఎక్కువే 

ఈ సినిమాకు సంబంధించి రైటింగ్ సైడ్ వెళ్ళలేదు. ఆల్రడీ శైలేష్ కథ -కథనం బాగా రాసుకున్నాడు. కాకపోతే నాకున్న డౌట్స్ ఎక్కువ అడిగే వాడిని. దానికి ఆన్సర్ ఇస్తూ శైలేష్ ఎప్పటికప్పుడు క్లారిటీ తో ఈ సినిమాను తీశాడు. నిజానికి నా కెరీర్ గ్రాఫ్ పెరగడానికి నాకున్న డౌట్స్ కారణమని భావిస్తాను.

హిట్ 3.. కథ తెలియదు 

హిట్ 3 లో నేను నటిస్తున్నా. హిట్ 2 క్లైమాక్స్ లో థర్డ్ కేస్ డీల్ చేసే మరో హీరో కూడా కనిపిస్తాడు. శైలేష్ క్లైమాక్స్ బాగా డిజైన్ చేసుకున్నాడు. కచ్చితంగా థియేటర్ బయటికి వెళ్ళేటప్పుడు ఓ మంచి ఫీల్ కలుగుతుంది.

గూడచారి 2 ...రాస్తున్నాను 

అన్నపూర్ణ స్టూడియోస్ లో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాను. ఆ సినిమాకు నా ఫ్రెండ్ డైరెక్టర్. అలాగే గూడచారి 2 కి కథ రాస్తున్నాను. ఆ కథ మా డైరెక్టర్ కి నచ్చాలి. ఇంకా టైం ఉంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics