#Helloworld crosses 5 crore+ streaming minutes

Wednesday,August 17,2022 - 05:39 by Z_CLU

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బేనర్ పై నిహారిక కొణిదెల నిర్మాణంలో శివ సాయి వర్ధన్ డైరెక్ట్ చేసిన 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంటూ రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ సిరీస్ అనిపించుకుంటుంది. సాఫ్ట్ వేర్ యువత కథతో ఆఫీస్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ జీ 5లో ఆగస్ట్ 12 నుండిస్ట్రీమింగ్ అవుతుంది. కేవలం ఐదు రోజుల్లోనే ఐదు కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ క్రాస్ చేసి ఈ వీక్ టాప్ సిరీస్ అనిపించుకుంది.

ముఖ్యంగా దర్శకుడు శివ సాయి వర్ధన్ ఈ సిరీస్ ని తీర్చి దిద్దిన తీరు OTT ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. సాఫ్ట్ వేర్ యువతీ యువకుల జీవితాన్ని అద్దం పట్టేలా ఈ సిరీస్ ని తెరకెక్కిన మంచి హిట్ కొట్టాడు దర్శకుడు. ఇక నటీ నటుల నటన , కథ -కథనం -ఫ్రెష్ గా అనిపించే  సన్నివేశాలు సిరీస్ కి హైలైట్ గా నిలిచాయి. సాఫ్ట్ వేర్స్ కథతో ఓ చక్కని సందేశం కూడా అందించి ఫైనల్ గా అందరూ చూసే సిరీస్ గా హలో వరల్డ్ ని రూపొందించారు.

ప్రస్తుతం ఈ సిరీస్ జీ5 సబ్స్క్రిప్షన్స్ కౌంట్ కూడా పెంచుతూ సక్సెస్ ఫుల్ సిరీస్ అనిపించుకుంటూ దూసుకెళ్తోంది. ఇంకా ఈ సిరీస్ ని చూడని వాళ్ళు  మిస్ అవ్వకుండా హలో వరల్డ్ ని చూస్తూ సాఫ్ట్ వేర్ వరల్డ్ లోకి అడుగుపెట్టి మంచి అనుభూతి పొందండి.

 

Click here 👇to watch  NOW

https://zee5.onelink.me/RlQq/helloworld