Hello Hello lyrical song from Raj tarun’s ‘Ahanapellanta’ out now

Wednesday,November 09,2022 - 12:32 by Z_CLU

రాజ్ తరుణ్ , శివాని రాజశేఖర్ జంటగా సంజీవ్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన 'అహనా పెళ్ళంట' వెబ్ సిరీస్ నుండి మరో సూపర్బ్ సాంగ్ రిలీజైంది. ఇటివల రిలీజైన టైటిల్ సాంగ్ కి మ్యూజిక్ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. తాజాగా  "హలో హలో" అంటూ వచ్చే మరో లిరికల్ వీడియోను విడుదల చేశారు.  జుదా శాండీ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి RR ధృవన్ అందించిన లిరిక్స్ హైలైట్ గా నిలిచాయి. సింగిల్ గా ఉంటూ ఎంజాయ్ చేయాలనుకునే కుర్రాడి ఆవేదకు అద్దం పట్టేలా ధృవన్ లిరిక్స్ అందించాడు.

'అహనా పెళ్ళంట' నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో పాటు రెండు సాంగ్స్  రిలీజై ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీజర్, ట్రైలర్ సిరీస్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా తెరకెక్కిన ఈ సిరీస్ కి దావూద్ కథ -స్క్రీన్ ప్లే అందించగా కళ్యాణ్ రాఘవ్ డైలాగ్స్ ఇచ్చాడు. రాహుల్ తమడ, సాయి దీప్ రెడ్డి బొర్రా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

 

నవంబర్ 17న 'అహనా పెళ్ళంట' ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. Dont Miss it !