HariHaraVeeraMallu new release date anounced !

Thursday,September 02,2021 - 02:40 by Z_CLU

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీర మల్లు' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. ఈ మేరకు ముందే ప్రకటన కూడా ఇచ్చారు. కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో షూటింగ్ మళ్ళీ వాయిదా పడటంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు.

తాజాగా పవన్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకొని కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 2022 ఏప్రిల్ 29న రిలీజ్ అంటూ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. సో పవన్ పీరియాడిక్ & హిస్టారికల్ ఫిక్షనల్ డ్రామా సినిమా సమ్మర్ కి షిఫ్ట్ అయిందన్నమాట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ షెడ్యుల్ మొదలు పెట్టారు. హైదరబాద్ లో అలనాటి చార్మీనార్ సెట్ కూడా వేశారు. అందులో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించి మళ్ళీ బ్రేక్ తీసుకున్నారు. త్వరలోనే మరో షెడ్యుల్ మొదలు పెట్టి నాన్ స్టాప్ గా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కోసం స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు పవన్. సినిమాలో యాక్షన్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకునేలా ఉంటాయని ఇన్సైడ్ టాక్.

HariHaraVeeramallu-new-release-date-announced-poster- jpg

ఈ ఏడాది చివరి కళ్ళా టోటల్ షూటింగ్ ఫినిష్ చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టనున్నాడట క్రిష్. సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది కనుక వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బేనర్ పై AM రత్నం సమర్పణలో దయాకరరావు నిర్మిస్తున్న ఈ సినిమాకు MM కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics