Hanuman Teaser gets 20 million views

Wednesday,November 23,2022 - 03:31 by Z_CLU

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమాలను రూపొందించడానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ ని సృష్టించాడు. యంగ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) నటిస్తున్న హను-మాన్ (Hanuman Movie) మల్టీవర్స్ నుండి వస్తున్న తొలి చిత్రం.  ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

టీజర్ లో అద్భుతమైన జలపాతాన్ని చూపిస్తూ  జలపాతంకు ఆనుకొని చేతిలో గధతో భారీ హనుమాన్ విగ్రహం దర్శనమిచ్చే విజువల్, నేపథ్యంలో శ్రీరామ నామం  టీజర్ లో హైలైట్ గా నిలిచాయి.  121 సెకన్ల టీజర్ విజువల్ వండర్ గా అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లింది. దీంతో టీజర్ అలవోకగా 20 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి రికార్డ్ నెలకొల్పింది.  ప్రస్తుతం యూ ట్యూబ్ ట్రెండింగ్ లో కొనసాగుతున్న ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. సినిమా కోసం మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics