Garjana movie releases on March 5

Saturday,February 20,2021 - 04:51 by Z_CLU

Garjana movie releases on March 5 మనిషి, జంతువు... వీరిలో ఎవరు ఎక్కువ ప్రమాదకరం? ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువు దాడి చేస్తుంది... మనిషి దాడి చేయడానికి కారణం అవసరం లేదు. ఈ అంశం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘గర్జన’.

శ్రీరామ్, లక్ష్మీరాయ్ జంటగా జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై బి. వినోద్ జైన్ సమర్పణలో ఎం. నరేష్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా విఎఫ్ఎక్స్ తో రూపొందిన పులి ఈ చిత్రం ద్వారా ఎక్కువసేపు వెండితెరమీద కనిపించనుంది.

ఓ చిన్నారి, ఓ యువతి, పులి మధ్య సాగే ఈ పులి వేట ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. టామ్ అండ్ జెర్రీ కథ మాదిరిగా సాగే ఈ వేట చివరికి ఎలా ముగుస్తుందో తెర మీద చూడాల్సిందే. కథ, స్క్రీన్ప్ ప్లే, సినిమాట్రోగ్రఫీ ఎంవీ పన్నీర్ సెల్వమ్ నిర్వర్తించారు. విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన పెద్దపులి ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత నరేష్ జైన్ తెలిపారు.

జె.పార్తిబన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 5న విడుదల చేయబోతున్నారు.

పొలాచ్చి, తలకొన, మున్నార్, చెన్నై, ఊటీ, కొడైకెనాల్ తదితర లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. శ్రీరామ్, లక్ష్మీరాయ్ జంటగా నటించిన ఈ చిత్రంలో ఇంకా దేవ్ గిల్, నైరా, వైష్ణవి చంద్రన్ మీనన్, ద్వైత, బ్లాక్ పాండి తదితరులు ఇతర పాత్రలను పోషించారు.