Five films in 2023 Sankranthi race !

Wednesday,October 26,2022 - 04:47 by Z_CLU

Five films in 2023 Sankranthi race !

వచ్చే సంక్రాంతికి నాలుగు సినిమాలు లాక్ అయ్యాయి. 'వాల్తేరు వీరయ్య' , 'వీర సింహా రెడ్డి', 'ఆది పురుష్' , 'వారసుడు' సంక్రాంతి పోటీలో నిలిచాయి. తాజాగా అఖిల్ 'ఏజెంట్' కూడా పొంగల్ రేస్ లో చేరింది. వీటిలో ప్రభాస్ 'ఆది పురుష్', విజయ్ 'వారసుడు' రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోగా మిగతా సినిమాలకు విడుదల తేది కన్ఫర్మ్ అవ్వలేదు.

ఇక చిరు , బాలయ్య ఇద్దరూ పక్కా మాస్ సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిస్తే విజయ్ ఫ్యామిలీ , యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. ఇక ప్రభాస్ ఆది పురుష్ మోషన్ పిక్చర్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. అఖిల్ ఏజెంట్ స్టైలిష్ యాక్షన్ ఫిలింగా రానుంది. అంటే వచ్చే సంక్రాంతి అన్ని జోనర్ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇప్పటి వరకూ సంక్రాంతి రేస్ లో ఐదు సినిమాలు పోటీలో ఉన్నాయి. వీటిలో ఏదైనా సినిమా వెనక్కు తగ్గుతుందా ? లేక అన్ని సినిమాలు ప్రకటించినట్లే థియేటర్స్ లోకి వస్తాయా వేచి చూడాలి.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics