First Single released from Raviteja’s KHILADI movie

Saturday,September 11,2021 - 05:48 by Z_CLU

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `ఖిలాడి` షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవ‌ల ర‌వితేజ‌, డింపుల్ హ‌య‌తి మీద తెర‌కెక్కించిన పాట ప్రోమోను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘ఇష్టం’ అనే మొదటి పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో డింపుల్ హయతి చీరకట్టులో ఆకట్టుకున్నారు. రవితేజ మీదున్న ప్రేమను డింపుల్ ప్రకటించేట్టుగా ఈ పాట కొనసాగుతుంది. తన డ్యాన్సులతో డింపుల్ హయతి కట్టిపడేయగా.. రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జీతో అద‌ర‌గొట్టారు. తెరపై ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. ఇక ఈ పాట‌కు  ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన మెలోడి ట్యూన్‌ను దేవీ శ్రీ  ప్రసాద్ ఇచ్చారు. శ్రీ మణి అద్భుతమైన సాహిత్యం అందించగా.. హరి ప్రియ గానం అందరినీ ఆకట్టుకుంటోంది. యశ్ మాస్టర్ ఈ పాటను అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసేందుకు దర్శకుడు రమేష్ వర్మ కష్టపడుతున్నారు. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయ‌నున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics