Fans are missing Mahesh Babu’s film this year!

Wednesday,February 03,2021 - 05:15 by Z_CLU

మహేష్ ఈ మధ్య గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఏడాదికి ఒక సినిమాతో కచ్చితంగా థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఏడాది గ్యాప్ తీసుకుంటున్నాడు. అవును సూపర్ స్టార్ నుండి ఈ ఏడాది సినిమా లేనట్టే. పరశురాం బుజ్జితో మహేష్ చేస్తున్న 'సర్కారు వారి పాట' వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా తాళం చెవి గుత్తుతో ఓ ప్రీ లుక్ పోస్టర్ వదిలి 2021 సంక్రాంతి రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేశాడు మహేష్. దీంతో ఈ ఇయర్ మహేష్ సినిమా మిస్ అవుతున్నాం అంటూ ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు.

 ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మేకింగ్ కి నంబర్ ఆఫ్ డేస్ కావాలి, పైగా షూట్ ఎక్కువ భాగం విదేశాల్లో ప్లాన్ చేయడం వల్ల మహేష్ గ్యాప్ తీసుకోక తప్పడం లేదు. మహేష్  మాత్రం ఈ ఏడాది తన సినిమా లేని లోటుని వచ్చే సంక్రాంతికి రెట్టింపు ఎంటర్టైన్ మెంట్ తో భర్తీ చేస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. పరశురాం మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో పాటు మహేష్ నుండి అభిమానులు ఆశించే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సినిమా ఉంటుందని తెలుస్తోంది.