F3 Team hungama at ZEE Mahotsavam Event

Tuesday,May 17,2022 - 01:49 by Z_CLU

F3 Team hungama at ZEE Mahotsavam Event

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'F3' ఈ నెల 27న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో టీం ప్రమోషనల్ ఈవెంట్స్ లో పార్టిసిపెంట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా 'జీ మహోత్సవం' ఈవెంట్ లో F3 టీం చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వెంకటేష్ తన టైమింగ్ తో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేశారు. ఇక వరుణ్ కూడా యాంకర్ శ్రీముఖిపై పంచ్ లు వేస్తూ ఈవెంట్ ని మరింత ఎంటర్టైనింగ్ గా మార్చేశాడు. వెంకటేష్ కామెడీ టైమింగ్ తో పేల్చిన జోకులు  ఈవెంట్ కి హైలైట్ గా నిలిచాయి.

వెంకటేష్ , వరుణ్ తేజ్, సునీల్ లతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈవెంట్ లో పాల్గొని సందడి చేశాడు. వెంకటేష్ సీన్లలో నటించి ఎంటర్టైన్ చేశాడు. ఓవరాల్ గా జీ మహోత్సవం ఈవెంట్ 'ఎఫ్3' టీంతో మరింత సందడిగా మారింది. ఇక హీరో రాజశేఖర్ , జీవితా రాజశేఖర్ , శివాని రాజశేఖర్ కూడా ఈవెంట్ లో పార్టిసిపెంట్ చేశారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ స్పెషల్ సాంగ్ ఈవెంట్ లో మరో హైలైట్.  టివీ ఆర్టిస్టులు కూడా జీ మహోత్సవంలో పాల్గొని సందడి చేసి ఆడియన్స్ కి మంచి వినోదం అందించారు.

జీ తెలుగు 17వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ జరిగిన జీ మహోత్సవం  ఈవెంట్ మే 22న ఆదివారం 6 గంటలకు  'జీ తెలుగు'లో  టెలికాస్ట్ కానుంది. చూసి ఎంజాయ్ చేయండి.

   
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress  Photos and Special topics