F3 Movie OTT release after 2 months only

Friday,June 03,2022 - 06:49 by Z_CLU

F3 Movie OTT release after 2 months only

ఎఫ్3 నిర్మాతలు సినిమా ఓటీటీ విడుదలపై మొదటి నుండి చాలా క్లారిటీతో ఉన్నారు. థియేట్రికల్ విడుదల తర్వాత కొన్ని వారాల్లోనే సినిమా ఏ ఓటీటీ వేదిక లోనూ విడుదల కాదని నిర్మాతలు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. 8 వారాల థియేట్రికల్ రన్‌ కు ముందు, ఎఫ్3 స్ట్రీమింగ్ కు రాదని మరోసారి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “ఎఫ్3ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ థాంక్యూ. ఎఫ్ 3ని థియేటర్ లో చూడకపోయినా 4 వారాల్లో ఓటీటీకి వస్తుందని అనుకున్నారు కదా.. ఇట్స్ నాట్ కమ్మింగమ్మా .. నాలుగు వారాల్లో రాదమ్మా..ఎనిమిది వారాల తర్వాతే వస్తుందమ్మా .. రెండు నెలల తర్వాత ఓటీటీకి వస్తుంది., సో అందరూ థియేటర్లకే వచ్చి ఎఫ్3ని చూసి ఈ సమ్మర్ లో సరదాగా నవ్వుకోండి” అని వెల్లడించారు.

ఈ ప్రకటనతో ఎఫ్3 సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి రాదనే క్లారిటీ వచ్చేసింది. ఇలా క్లారిటీ ఇవ్వడం వల్ల సినిమాకు రిపీట్ ఆడియన్స్ పెరుగుతారని యూనిట్ భావిస్తోంది. పైగా ఓటీటీలో వస్తుందని ఇప్పటివరకు చూడకుండా ఉన్న ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తారని నమ్ముతోంది.

మరి వీళ్ల ఎత్తుగడ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఎఫ్3 సినిమాలో వెంకీ, వరుణ్ హీరోలుగా నటించారు. అనీల్ రావిపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమాను శిరీష్ నిర్మించగా, దిల్ రాజు ప్రజెంట్ చేశాడు.

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics