Exclusive : VV Vinayak with Pawan Kalyan

Tuesday,February 02,2021 - 12:24 by Z_CLU

ఏంటి వినాయక్ తో పవన్ కళ్యాణ్ ఆ? అదేంటి ఇప్పటికే పవన్ లిస్టులో నాలుగు సినిమాలున్నాయి. మళ్ళీ ఈ కొత్త కాంబో ఏంటి ? అనుకుంటున్నారా ? అసలు విషయం ఏమిటంటే ... పవన్ కళ్యాణ్-వినాయక్ కాంబో నిజమే. కానీ వినాయక్ డైరెక్షన్ కాదు. పవన్ కోసం మళ్ళీ వినాయక్ నటుడిగా మారాడు. అవును.. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ -రానా కాంబో సినిమాలో వినాయక్ గెస్ట్ రోల్ చేశాడు.

సినిమాలో ఓ సందర్భంలో ఒక క్యామియో అవసరం పడింది. దాన్ని వినాయక్ తో చేయిస్తే బాగుంటుందని టీం భావించారట. వెంటనే వినాయక్ కి విషయం చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు. తాజాగా అల్యూమినియం ఫ్యాక్టరీలో వినాయక్ పై సన్నివేశాలు తీశారు.

గతంలో 'నేనింతే' సినిమాలో పూరి, రవితేజ కోసం వినాయక్ క్యామియో చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత పవన్-రానా సినిమా కోసం నటుడిగా మేకప్ వేశారు స్టార్ డైరెక్టర్. అయితే వినాయక్ ఇందులో ఏ రోల్ చేశారు..?అసలు డైరెక్టర్ క్యామియో ఎందుకు ? అనేది తెలియాల్సి ఉంది.