Exclusive.. Ashish 2nd movie details

Tuesday,August 31,2021 - 12:13 by Z_CLU

బడా నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఆశిష్ 'రౌడీ బాయ్స్' తో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. హీరోగా లాంచవుతున్న ఫస్ట్ సినిమా కావడంతో ఈ సినిమాపై దిల్ రాజు చాలా కేర్ తీసుకుంటున్నారు. అందుకే 'హుషారు' తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు హర్ష కొనుగంటి చేతిలో ఆశిష్ డెబ్యు సినిమా పెట్టారు. మొదటి సినిమా తరహాలోనే ఈ సినిమాను కూడా కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు హర్ష. షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి చేసుకొని ఫైనల్ స్టేజిలో చేరుకున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అవ్వనుంది.

అయితే మొదటి సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే రెండో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు ఆశిష్. అవును #Ashish2 సినిమా ఇటివలే లాకయింది. సుకుమార్ దగ్గర కొన్నేళ్ళుగా వర్క్ చేస్తున్న కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవ్వనున్నాడని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కాస్టింగ్ & టెక్నీషియన్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. మిక్కీ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాను మరో నిర్మాతతో కలిసి దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తుంది.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. ఆశిష్ మొదటి సినిమా 'రౌడి బాయ్స్' విడుదలయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే రెండో సినిమా లాక్ చేసుకున్న ఆశిష్ ఇదే స్పీడుతో హీరోగా వరుస సినిమాలు చేస్తాడేమో చూడాలి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics