Dr Rajasekhar Interview about Shekar Movie

Thursday,May 19,2022 - 04:39 by Z_CLU

యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ హీరోగా జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శేఖర్' రేపే థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు హీరో రాజశేఖర్. శేఖర్ ఎక్స్ పీరియన్స్ తో పటు పలు విషయాలు చెప్పుకున్నారు. ఆ విశేషాలు రాజశేఖర్ మాటల్లోనే...

 

రీమేక్స్ కలిసొచ్చాయి

'శేషు' మినహా తెలుగులో నేను రీమేక్ చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ సాధించాయి. శేషు మిస్ ఫెయిర్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మిగతావన్నీ నాకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చాయి. రీమేక్ అంటే గ్యారెంటీ ఉంటుంది. స్ట్రైట్ సినిమా కంటే రీమేక్ సేఫ్ అనిపిస్తుంది. మలయాళంలో 'జోసెఫ్' సినిమా చూడగానే ఈ సినిమా నాకు యాప్ట్ అనిపించింది. మంచి కథతో కూడిన క్రైం థ్రిల్లర్ సినిమా. అందుకే ఈ రీమేక్ ని పిక్ చేసుకున్నాము. కచ్చితంగా శేఖర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

 

ఇద్దర్ని వద్దన్నాను

సినిమాలో నాకు కూతురు కేరెక్టర్ కి శివాని , శివాత్మిక ఇద్దరు వద్దని చెప్పాను. కానీ జీవిత పట్టుబట్టి మీ ఇద్దరు చేస్తే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని రియర్ లైఫ్ ఫాదర్ డాటర్ ఫీల్ కూడా ప్లస్ అవుతుందని నన్ను కన్విన్స్ చేసింది. ఆ తర్వాత ఇద్దరిలో ఈ కేరెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందని ఓ డిస్కషన్ వస్తే శివాని కోసం శివాత్మిక త్యాగం చేసింది. శివాత్మికతో ఫుల్లెంత్ సినిమా చేయబోతున్నాను దానికి కథ రెడీ అవుతుంది.

 

కొత్త లుక్.. అందుకే 

సినిమా కోసం ఓ కొత్త లుక్ ట్రై చేశాను. 55 ఇయర్స్ ఓల్డ్ కేరెక్టర్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఫైనల్ చేశాము. సెట్లో అందరూ లుక్ బాగుందని చెప్పేవారు. ఆ లుక్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు థియేటర్స్ లో ఆ లుక్ తో కొత్త రాజశేఖర్ కనిపిస్తాడు.

 

జీవిత బాగా హ్యాండిల్ చేసింది 

ఈ సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. స్క్రీన్ పైకి ఆ ఎమోషన్ తీసుకొచ్చి ఆడియన్స్ కి సినిమాను కనెక్ట్ చేయడంలో జీవిత సక్సెస్ అయ్యింది. ఇక సెట్స్ లో ఇద్దరం హీరో -డైరెక్టర్ గా మాత్రమే ఉంటాం. తనకి ఏం కావాలో అది ఇవ్వడం నా వంతు. నా నుండి ఏం తీసుకువాలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ అవసరమో ఆమె తీసుకుంటుంది. ఎప్పుడైనా సందేహం ఉంటే ఇద్దరం మాట్లాడుకుంటాం.

 

ట్రైలర్ చూసి మెచ్చుకుంటున్నారు

ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమా ఎలా ఉండబోతుందో చెప్పే ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసిన అందరూ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. సినిమా రిలీజ్ కి ముందు ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసింది.

 

సాయి కుమార్ ఫోన్ చేసి చెప్పాడు

నా సినిమాలకు డబ్బింగ్ చెప్పేటప్పుడు సాయి కుమార్ గారు కాల్ చేసి మాట్లాడతారు. 'గరుడ వేగ' తర్వాత సాయి కుమార్ గారు మళ్ళీ ఈ సినిమాకు గానూ నా కేరెక్టర్ కి డబ్బింగ్ చెప్పారు. ఆయన ఫోన్ చేసి హిట్టు కొట్టావ్ అని అన్నారు. ఆ మాట విని చాలా సంతోష పడ్డాను. అలాగే సెన్సార్ వారు కూడా సినిమా చూసి అభినందించారని జీవిత చెప్పింది.

 

అనూప్ మ్యూజిక్ ఇంపాక్ట్

సినిమాలో కొన్ని సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. వాటిలో సీన్ లో ఉన్న దమ్ము పెర్ఫార్మెన్స్ ఒక రీజన్ అయితే మరో రీజన్ అనూప్ మ్యూజిక్. అనూప్ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చి సినిమాకు ప్లస్ అయ్యారు.

 

ఫ్యామిలీ అంతా కలిసి

నలుగురం కలిసి ఓ సినిమా చేయాలనుంది. ఇటివలే దొరసాని దర్శకుడు మహేందర్ గారు ఫ్యామిలీ అంతా కలిసి నటించే స్క్రిప్ట్ చెప్పారు. అలాగే 'గరుడ వేగ 2' లో ప్రవీణ్ సత్తారు మీ ఇద్దరు అమ్మాయిలను కూడా పెడదాం అని అన్నారు. చూడాలి మేము కలిసి నటించే సినిమా ఏది అవుతుందో ?

 

అది బ్యాడ్ ఫేజ్

నాకు కోవిడ్ వచ్చినప్పుడు ఇంక బ్రతకని అనుకున్నాను. మా అక్కకి కాల్ చేసి ఇంక అంతా అయిపొయిందని ఏడ్చేశాను. కానీ ఆ టైంలో జీవిత , నా పిల్లలు చాలా కేర్ తీసుకొని నీకు ఏం అవ్వదు రికవరీ అవుతారు అని దైర్యం చెప్తూ నాకు 24 హౌర్స్ సేవ చేశారు. నాతో పాటే వాళ్ళు కూడా ICU లో ఉన్నారు. ఐ సీ యూ లో టివీ పెట్టించుకొని సినిమాలు , సాంగ్స్ చూస్తున్నప్పుడు అలా డాన్స్ చేయాల్సిన వాడిని ఇక్కడ ఉన్నాను అని ఫీలయ్యాను. ఎలాగోలా మళ్ళీ రికవరీ అయి బయటపడ్డాను. ఆ టైంలో బాగా బరువు తగ్గిపోయాను. అది నా కెరీర్ లో ఓ బ్యాడ్ ఫేజ్ అనుకుంటున్నాను. ప్రస్తుతం అంతా బాగానే ఉంది.

 

బాగుందనే టాక్ వస్తే

నన్ను అభిమానించే ప్రేక్షకులకు నా సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నాను. సినిమా బాగుంది అని టాక్ వచ్చిన వెంటనే థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడండి. కచ్చితంగా సూపర్ హిట్ టాక్ వస్తుంది. అందులో సందేహం లేదు.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics