Director Karuna Kumar Speech at Sridevi Soda Center Pre-Release Event

Sunday,August 22,2021 - 02:30 by Z_CLU

శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను ఓటీటీ సినిమా కాదంటున్నాడు దర్శకుడు కరుణ కుమార్. అందరూ కుటుంబాలతో కలిసి థియేటర్లకు వచ్చి చూసే సినిమా అంటున్నాడు. శ్రీదేవిసోడా సెంటర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ కామెంట్స్ చేశాడు కరుణ.

"ఈరోజు నేను ఈ వేదిక మీద నిలబడ్డానికి పలాస సినిమానే కారణం ఆ సినిమా అవకాశం ఇచ్చిన అట్లూరి వరప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. సుధీర్ బాబు 12 సినిమాలు చేసిన హీరో అయ్యి ఉండి కూడా నేను చెప్పిన కథ నచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చారు. వారికి నా కృతజ్ఞతలు. సుధీర్ బాబు ద్వారా 70 mm నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు నా కథని విని ఈ సినిమాను ప్రిస్టేజిస్ గా తీసుకొని చేయడానికి ముందుకు రావడమే గాక వరల్డ్ క్లాస్ కెమెరామెన్ శ్యాం ప్రసాద్, పుష్ప, రంగస్థలం సినిమాలకు చేసిన ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ -మౌనిక , నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, చిన్నప్పటి నుండి సంగీత దర్శకుడు మణిశర్మ గారి పాటలు వింటూ పెరిగిన నాకు ఆయన ఈ సినిమాకు సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది. మొదటగా ఆయన దగ్గరకు వెళ్ళాలంటే భయమేసింది. అటువంటిది ఆయన నన్ను తమ్ముడిలా ఆదరించి నాలో ఉన్న భయాన్ని పోగొట్టి ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. మంచి డైరెక్షన్ టీంను ఇలా పెద్ద టాప్ క్లాస్ టెక్నీషియన్ని మాకు అందించారు నిర్మాతలు. ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా తీశాము. నిర్మాతలు 24 గంటలు మా వెంట ఉంటూ మాకెంతో సపోర్ట్ చేస్తూ ఇప్పటివరకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా నిర్మించారు. ఆగస్టు 27వ తేదీన వస్తున్న మా సినిమా ఓటిటి లో చూసే సినిమా కాదు అందరూ ఫ్యామిలీ తో వచ్చి థియేటర్స్ లో మాత్రమే చూడవలసిన సినిమా ఇది అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది"