Director Hasith Goli Interview

Tuesday,August 17,2021 - 05:00 by Z_CLU

ఏ దర్శకుడికయినా మొదటి సినిమాతోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. 'రాజ రాజ చోర' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతూ సినిమాతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు హసిత్ గోలి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 19న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హసిత్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు తన మాటల్లోనే...

షార్ట్ ఫిలిమ్స్ తో మొదలు

నేను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాను. కాకపోతే సినిమాలంటే చాలా ఇంటరెస్ట్ ఉండేది. సో నేను వివేక్ కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాము. లక్కీ గా తనకి ప్రొడ్యూసర్ దొరికారు. సో మెంటల్ మదిలో సినిమాకి తనతో కలిసి వర్క్ చేశాను. అప్పటి వరకు మా పేరెంట్స్ కి కూడా ఒక డౌట్ ఉండేది. ఇంత మంచి కెరీర్ వదిలేసుకొని వీళ్ళు సినిమాలు అంటూ వెళ్తున్నారని. కానీ మెంటల్ మదిలో చూశాక వారికి ఓ క్లారిటీ వచ్చింది.

ముందు వేరే కథతో

మెంటల్ మదిలో మూవీ తర్వాత శ్రీ విష్ణు గారికి వేరే కథ చెప్పాను. అది చేద్దామనుకున్నాం.కానీ నాకు ఎక్స్ పీరియన్స్ కావాలి అని టైం తీసుకున్నాను. ఆ తర్వాత బ్రోచెవారెవరురా సినిమాకి కూడా వర్క్ చేసి ఇంకా ఎక్స్ పీరియన్స్ తెచ్చుకున్నాను. సో ఆ సినిమా తర్వాత నేను శ్రీ విష్ణు ఇద్దరం ముందు చెప్పిన కథతో సినిమా అనుకున్నాం. కానీ దానికంటే బెటర్ లైన్ అనిపించి 'రాజ రాజ చోర' చేశాం.

కామెడీ టైమింగ్ చాలా ఇష్టం

శ్రీ విష్ణులో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. అందుకే తనకోసం టైలర్ మేడ్ లాంటి దొంగ క్యారెక్టర్ రాశాను. నెగిటివ్ తో గ్రే షెడ్ ఉన్న క్యారెక్టర్ నుండి ఎక్కువ డ్రామా క్రియేట్ చేయొచ్చు. అలాంటి క్యారెక్టర్స్ తో హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ ప్లాన్ చేస్తే బాగుంటదని ఐడియాతోనే ఈ సినిమా చేశాను. దొంగతనం ఎందుకు చేస్తున్నాడు ? వాడి లైఫ్ ఏంటి ? అనేవి సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

అందుకే ఈ టైటిల్

నేను వివేక్ ఎక్కువగా తెలుగు టైటిల్స్ కే ప్రియారిటీ ఇస్తాం. మెంటల్ మదిలో కి ముందు 'చెలియో చెల్లకో' అనే టైటిల్ అందుకున్నాం. కానీ ఫైనల్ గా మెంటల్ మదిలో అని పెట్టాల్సి వచ్చింది. అందుకే తర్వాత 'బ్రోచేవారెవరురా' అనే అచ్చ తెలుగు టైటిల్ పెట్టాం. సో మన తెలుగు భాష , పద్యాలు , రచనలు ఇష్టపడతాం కాబట్టి అచ్చ తెలుగులోనే టైటిల్స్ పెట్టాలనుకుంటాం. అందుకే నా సినిమాకు కూడా 'రాజ రాజ చోర' అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఏ రాజు గురించయినా ఇంట్రో ఇచ్చే ముందు వాడే పదాలు అవి. ఇక చొర అంటే దొంగ కి పర్యాయ పదం. రెండిటిని సింక్ చేసి కథకి పర్ఫెక్ట్ అనిపించడంతో ఫిక్స్ చేశాం.

ఇంట్రెస్టింగ్ డ్రామాతో నవ్వించే ప్రయత్నం

సినిమాలో మంచి కామెడీ ఉంటుంది. కొన్ని నిమిషాల పాటు హిలేరియస్ గా నవ్వుతారు. అలాగే సినిమాలో ఇంట్రెస్టింగ్ డ్రామా ఉంటుంది. కథ లేకుండా ఊరికే నవ్వించడం కోసం తీసిన సినిమా కాదిది. ఓ ఆసక్తికర కథలో కామెడీ , ఎమోషన్ ఉంటాయి. దర్శకుడిగా నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. ఏ సినిమా కయినా డ్రామానే ఇంపార్టెంట్ అని నమ్ముతాను.

కీరిటంతో మంచి కామెడీ

సినిమాలో కీరిటం మీద మిస్టేక్ లేయర్ ఒకటి రన్ అవుతుంటుంది. ఆ ఫన్ డ్రైవ్ తీసుకోచ్చేది కీరిటమే. అదేంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

అన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి

సినిమాలో పర్టిక్లర్ గా ఒక క్యారెక్టర్ మాత్రమే కాకుండా అన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి. రీసెంట్ గా ఓ షో వేసుకున్నాం. సినిమా చూసి అండర్ ప్లే క్యారెక్టర్స్ గురించి కూడా చెప్పారు. అది నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు. సో రేపు ఆడియన్స్ కూడా అన్ని క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయి మాట్లాడతారని అనుకుంటున్నాను. కాకపోతే శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ ఎక్కువ నచ్చుతుంది.

వాళ్ళ ట్రాక్ బాగా ఎంటర్టైన్ చేస్తుంది

సినిమాలో శ్రీ విష్ణు కి ఫ్రెండ్ గా గంగవ్వ నటించారు. హీరోకి క్లాస్ మేట్ , గ్లాస్ మేట్స్ అన్ని తనే. వాళ్ళిద్దరి ట్రాక్ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. థియేటర్స్ లో అందరు ఎంజాయ్ చేస్తారు.

సులువుగానే అయిపొయింది..కానీ !

కథ రాసుకున్నాక శ్రీ విష్ణు గారికి చెప్పాను. ఆయన బాగా నమ్మాడు. సో ఈ కథని నమ్మే నిర్మాతలు ఉంటారు. కచ్చితంగా ఇది వర్కౌట్ అవుద్ది అనుకున్నాం. ముందుగా ML కుమార్ చౌదరి గారికి అలానే కీర్తి గారికి చెప్పాను. తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరి , అభిషేక్ అగర్వాల్ గారికి వినిపించాం. వాళ్లకి బాగా నచ్చింది. లేట్ చేయకుండా ప్రాజెక్ట్ సెట్స్ పైకి ఎక్కించేశాం. సెట్స్ పైకి వెళ్ళే వరకు అంతా సులువుగానే అయ్యింది. కానీ షూటింగ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ వేవ్ రావడం రిలీజ్ దగ్గరలో ఉండగా సెకండ్ వేవ్ రావడంతో రిలీజ్ లేట్ అయ్యింది.

 

ఫస్ట్ మాట్లాడేవి వాటి గురించే

సినిమా చూశాక మ్యూజిక్ గురించి బాగా మాట్లాడుకుంటారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పుకుంటారు. మొన్న షో చూశాక మా క్రూ కూడా ఫస్ట్ వివేక్ సాగర్ మ్యూజిక్ గురించే చెప్పారు. ఆ తర్వాత ఒక్క ఒక్క విషయం గురించి మాట్లాడారు. టెక్నీషియన్స్ అందరు మంచి ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారు. సో అన్ని విభాగాల గురించి చూసిన వాళ్ళు మెన్షన్ చేసి చెప్తారని అనుకుంటున్నా.

 

ఓటీటీ అవ‌కాశాలు వ‌చ్చాయి

కోవిడ్ ఫ‌స్ట్ వేవ్‌, లాక్‌డౌన్ స‌మ‌యానికి సినిమా పూర్తి కాలేదు. త‌ర్వాత సెకండ్ వేవ్ వ‌చ్చే స‌మ‌యానికి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌కు చేరుకున్నాం. అప్పుడు ఓటీటీ అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే నిర్మాత‌లు సినిమాను ఓటీటీలో కాకుండా థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

రిలీజ్ తర్వాత పని మొదలు పెడతా 

ఈ సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత, మ‌రో స్క్రిప్ట్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాను. దాన్ని ముందు పూర్తి చేస్తాను.