Director Harish Shankar to direct Salman Khan soon ?

Wednesday,April 13,2022 - 04:58 by Z_CLU

'గాడ్ ఫాదర్' తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా తెలుగులో సినిమా చేయబోతున్నాడా ? అంటే అవుననే టాక్ వినబడుతుంది.  ఇటివలే దర్శకుడు హరీష్ శంకర్ సల్మాన్ ఖాన్ ని కలిసి కాసేపు టైం స్పెండ్ చేశాడు. స్వయంగా హరీష్ శంకరే సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ఫోటోతో పోస్ట్ చేశాడు. దీంతో ఈ క్రేజీ కాంబోలో సినిమా రానుందనే ప్రచారం జరుగుతుంది. 

 తనతో టైం స్పెండ్ చేసినందుకు సల్మాన్ ఖాన్ కి థాంక్స్ చెప్తూ ఈ మూమెంట్స్ ఎప్పటికీ పదిలంగా దాచుకుంటానంటూ చెప్పుకున్నాడు. అలాగే ఇది జరగడానికి కారణమైన మైత్రి నిర్మాత నవీన్ యర్నేని కి కూడా థాంక్స్ చెప్పాడు హరీష్. అంటే హరీష్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సల్మాన్ ఖాన్ తో ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా ? అందుకే హరీష్ ని సల్మాన్ ఖాన్ దగ్గరికి తీసుకెళ్ళారా అనే ప్రశ్నలు  మొదలయ్యాయి.

చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటివలే షూట్ కూడా కంప్లీట్ చేశారు. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమా తర్వాత తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేసే ప్లాన్ ఉన్నాడని తెలుస్తుంది. మరి హరీష్ శంకర్ సల్మాన్ ఖాన్ కి ఏదైనా స్క్రిప్ట్ వినిపించాడా ? లేదా ఇది జస్ట్ క్యాజువల్ మీటింగా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో పవన్ కళ్యాణ్ తో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేస్తున్నాడు హరీష్.

 
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics