Director Change his plans on upcoming Movies

Thursday,April 15,2021 - 03:47 by Z_CLU

కొన్ని క్రేజీ కాంబినేషన్ సినిమా ఎనౌన్స్ మెంట్స్ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ క్యూరియాసిటీ కలిగిస్తాయి. తాజాగా అలాంటి ఎనౌన్స్ మెంట్స్ అభిమానులు సంతోషపెట్టి ఆ వెంటనే నిరాశ పరిచేలా చేస్తున్నాయి. అవును ఒక హీరోతో సినిమా ఎనౌన్స్ చేసి ఆ వెంటనే మరో హీరోని లైన్లో పెట్టి సినిమాలు మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నారు దర్శకులు. ఈ లిస్టులో కొరటాల శివ , త్రివిక్రమ్ తో పాటు తాజాగా శంకర్ కూడా చేరాడు.

కొన్ని రోజుల క్రితం తారక్ తో #NTR30 ఎనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. అరవింద సమేత తర్వాత మళ్ళీ ఈ కాంబోలో వస్తున్న సినిమాపై ప్రకటన నుండే అంచనాలు మొదలయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు #NTR30 ని కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నాడని ఎనౌన్స్ చేసారు మేకర్స్. దీంతో ఉన్నపళంగా త్రివిక్రమ్ -ఎన్టీఆర్ కాంబో సినిమా లేదని తెలిసి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు.

కొరటాల-ఎన్టీఆర్ మూవీ డీటెయిల్స్

ఇక కొరటాల కూడా అంతే.. ఆచార్య తర్వాత బన్నీ తో సినిమా అంటూ ఎనౌన్స్ చేశాడు. అంతా రెడీ అనే సమయానికి ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు షిఫ్ట్ అయ్యాడు. ఆచార్య షూట్ ఫినిష్ చేసి తారక్ తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు కొరటాల. దీంతో ఫస్ట్ టైం అల్లు అర్జున్ -కొరటాల కాంబోలో సినిమా వస్తుందని ఆశ పడిన బన్నీ ఫ్యాన్స్ షాక్ తిన్నారు. అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నల వర్షం కురిపించడంతో త్వరలోనే కొరటాల -అల్లు అర్జున్ కాంబో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

లేటెస్ట్ గా రామ్ చరణ్ తో ఓ భారీ సినిమా ఎనౌన్స్ చేశాడు శంకర్. ఈ కాంబో ప్రకటన నుండే అందరిలో ఆసక్తి కలిగించి ఎట్రాక్ట్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు చరణ్ సినిమాని పక్కన పెట్టి బాలీవుడ్ లో రన్వీర్ సింగ్ తో 'అపరిచితుడు' రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు శంకర్. దీంతో మెగా ఫ్యాన్స్ శంకర్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి శంకర్ చరణ్ సినిమా తర్వాత ఈ రీమేక్ చేస్తాడా ? లేదా ముందే ఈ రీమేక్ మొదలు పెడతారా ? అనేది తెలియాల్సి ఉంది.

ఏదేమైనా ఒకరితో ఓ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి మరో హీరోతో సినిమా అంటూ తారుమారు వ్యవహారం చేస్తున్నారు టాప్ డైరెక్టర్స్. మరి ఈ మార్పుల వెనుక ఉన్న మర్మ రహస్యం ఏమిటో వాళ్ళకే తెలియాలి.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics