Director Anil Ravipudi Interview

Tuesday,March 09,2021 - 02:19 by Z_CLU

వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న అనిల్ రావిపూడి సమర్పడుకిగా మారి చేసిన సినిమా'గాలి సంపత్'. డా.రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ పోషించి, శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మార్చ్ 11న శివరాత్రి కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి సినిమా గురించి మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

ఆసక్తిగా అనిపించింది 

నా ఫ్రెండ్‌ ఎస్‌.కృష్ణ నా అన్నిసినిమాలకు రైటర్‌గా పని చేశాడు. నిర్మాతగా లాంచ్‌ అవ్వాలని తను గాలిసంపత్‌ కథ రాసుకున్నాడు.. టైటిల్ చెప్పగానే గాలికి తిరిగే హీరో కథేమో అనుకున్నా. కానీ నోటి నుండి మాట కాకుండా గాలి మాత్రమే వచ్చే ఓ వ్యక్తి కథ అని తెలియగానే ఇంట్రెస్టింగ్ గా  అనిపించింది. అలాగే ఒక గొయ్యిలో పడిపోయినోడు ఎలా పైకొస్తాడు ? అనే ఎలిమెంట్ బాగా నచ్చింది. సాయి వెంటనే టీంఒక టీం ఫాం చేసుకున్నాడు. ఫైనల్ గా ఒక టీమ్‌ వర్క్‌లా 'గాలి సంపత్‌'ను పూర్తి చేశాం.

అనీష్‌ సెన్సిబుల్‌ డైరెక్టర్

దర్శకుడు అనీష్‌ చేసిన అలా ఎలా? సినిమా చూశాను నేను. అనీష్‌ సెన్సిబుల్‌ డైరెక్టర్‌. సెకాండాఫ్‌లో వచ్చే గొయ్యి సీన్స్, క్లైమాక్స్‌ సీన్స్‌లో చిత్ర యూనిట్‌ను డిస్ట్రబ్‌ చేయకుండా వారికి కావాల్సిన సహాయం చేశాను. నా ఫ్రెండ్‌ కృష్ణతో పాటు మరికొందరికి ఈ సినిమా తొలి సినిమా. అందుకే కాస్త ఎక్స్‌ ట్రా కేర్‌ తీసుకున్నాం.

GAALI_SAMPATH_Movie_Sree_vishnu

అరకులోని హిల్‌ స్టేషన్‌లో

స్క్రిప్ట్‌ పరంగా హెల్ప్‌ చేశాను. ముఖ్యంగా స్క్రీన్‌ ప్లే చూసుకున్నాను. అరకులోని హిల్‌ స్టేషన్‌లో జరిగే కథ ఇది. ఓ ఇంటి వెనక ఉన్న పాడుబడ్డ 30 అడుడుల బావిలో పడిన ఓ మాటలు రాని వ్యక్తి ఎలా భయటపడ్డాడు?. వర్షం పడినప్పుడు అతను ఎదుర్కొన్న పరిస్థితిలు ఏమిటీ? వాళ్లు ముందే ఆ బావిని ఎందుకు పూడ్చలేదు? అన్న అంశాల చూట్టూ గాలిసంపత్‌ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో నేచ‌ర్‌కి సంబందించిన ఒక బిగ్ ఎలిమెంట్ ఉంది. రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు తండ్రీ కొడుకులుగా చేశారు. వారితో పాటు వ‌ర్షం కూడా ఒక పాత్ర పోషించింది. నేచ‌ర్ అనేది విల‌న్‌లాగా ఫీల‌య్యే ఈ మాట‌లు రాని వ్య‌క్తి ఆ నేచ‌ర్‌తో ఎలా ట్రావెల్ అయ్యాడు అనే ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఉంది. ఇవ‌న్ని క‌థ‌కు త‌గ్గ‌ట్టు బ్లెండ్ చేశాం.

థ్రిల్‌ అవుతారు

ఈ సినిమాలో శ్రీ విష్ణు, రాజేంద్రప్రసాద్‌గారు తండ్రీకొడుకులు. తండ్రిది ఒక లక్ష్యం. కొడుకుది మరొక లక్ష్యం. రెండు వేరు వేరు దారులు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య చోటుచేసుకునే ఈగో క్లాషెష్‌నే 'గాలిసంపత్'‌ కథ. రాజేంద్రప్రసాద్‌గారు ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. తండ్రి వల్ల ఇబ్బందులు పడే కొడుకు పాత్రలో శ్రీవిష్ణు యాక్ట్‌ చేశారు. బాగా చేశాడు. శ్రీ విష్ణుకు మంచి లవ్‌ట్రాక్ కూడా ఉంటుంది. తండ్రీకొడుకుల మధ్య దూరం పెరగడానికి ఈ లవ్‌ కూడ ఓ కారణం. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు ఈ సినిమాలో వర్షం కూడ ఓ విలన్‌లా కనిపిస్తుంది. అదీ ఎలా అనేది సినిమాలో చూడండి. ఆడియన్స్‌ తప్పకుండా థ్రిల్‌ అవుతారనే నమ్మకం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలకు గాలిసంపత్‌ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది.

Anil-Ravipudi-Direction-Supervision-Gaali-Sampath-1

మంచి ఎమోషన్స్‌ ఉంటాయి

నా పేరు ఉంది కదా అని ఇది కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ అని చెప్పను. ‘ఎఫ్‌2’ లా ఉండదు. సినిమాలోని తొలిపార్టు సరదాగా ఉంటుంది. సెకండాఫ్‌లో మంచి ఎమోషన్స్‌ ఉంటాయి. సెకండాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ తక్కువ. ఇంతవరకు నేను విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయలేదు. ఈ సినిమాకు అసోసియేషన్‌తో ఆ అనుభవం వచ్చింది. కాస్త కొత్తగా అనిపించింది. మాటలు రాని వ్యక్తి ఊహించని విధంగా గోయ్యిలో పడితే ఎలా ఉంటుంది? అతను ఎలా భయటకు వచ్చాడు? అన్న అంశాలను ఆడియన్స్‌ ప్రిపేరై వస్తే సినిమాను బాగా ఆస్వాదిస్తారు. అందుకే ట్రైలర్‌లోనే ఆల్మోస్ట్ కథ చెప్పేశాము. ఈ సినిమా ఎక్కువమందికి రీచ్‌ కావడానికి వారి వెనక నేను నిలబడ్డాను. కథలో గ్రిప్‌ ఉంది. అందుకే ఎమోషన్స్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను కలిశాయి. వీటిని ఆసక్తికరంగా ఎలా డీల్‌ చేశామన్నది ఆడియన్స్‌ వెండితెరపై చూడాలి. ఈ సినిమా నిర్మాత ఎస్‌.కృష్ణ కథ రాసుకున్నారు. క్యాస్ట్‌ అండ్‌ క్రూ ఎంపికను తనే చూసుకున్నాడు. నేను ఒక ఫ్రెండ్‌గా అతనికి సహాయం చేశాను అంతే.

షాక్‌ అయ్యా

ఈ సినిమాలోని ఆర్‌ఆర్‌ గురించి కాస్త టెన్షన్‌ పడ్డాను. ఎందుకంటే సెకండాఫ్‌లో రాజేంద్ర‌ప్రసాద్‌గారికి కంప్లీట్‌గా మాటలు రాన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తోనే కథ ముందుకు వెళ్లాలి. కానీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ బాగా చేశారు. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక నేను షాక్‌ అయ్యాను. అచ్చులో అంత టాలెంట్‌ ఉందా? అని నాకు అనిపించింది. అలాగే సత్య క్యారెక్టర్, కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. రాజేంద్రప్రసాద్‌గారి క్యారెక్టర్‌కు డబ్బింగ్‌ చెబుతుంటాడు.

నిర్మాత కష్టాలు తెలిశాయి

దర్శకుడిగా వచ్చినప్పుడే హ్యాపీగా ఉన్నాను. సమర్పకుడిగా వచ్చినప్పుడు నిర్మాతకు ఉండే కష్టాలు తెలిశాయి. గాలిసంపత్‌ సినిమాకు సాహు, హరీష్‌లు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. సినిమా పరంగా ఇప్పటివరకు అయితే నిర్మాతలు సేఫ్‌. తక్కువ బడ్జెట్‌లోనే కంప్లీట్‌ చేశాం. లెక్కలు చెప్పలేను. మిర్చి సినిమాలో ప్రభాస్‌గారు చెప్పినట్లు ‘మనం సేఫ్‌’ అన్నారు. సాహుగారితో ఓ సినిమా చేయాలని సుప్రీమ్‌ టైమ్‌ నుంచే అనుకుంటున్నాను. కానీ కుదర్లేదు. త్వరలో వారితో కూడ ఓ సినిమా చేస్తాను.

టైమ్‌ వచ్చినప్పుడు నేను కూడా

చిన్న సినిమాలను తప్పకుండా ప్రొత్సహిస్తాను. కంటెంటే పెట్టుబడి. నేను స్టార్ట్‌ అయ్యిందదే చిన్న సినిమాల నుంచి. కానీ ప్రజెంట్‌ అనిల్‌ రావిపూడి సినిమాలు అంటే ఆడియన్స్‌లో ఓ రకమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. వాటిని బ్రేక్‌ చేయకూడదు. టైమ్‌ వచ్చినప్పుడు నేను కూడ చిన్న సినిమాలను చేస్తాను.

 సీక్వెల్‌ కాదు

 ‘ఎఫ్‌3’ షూటింగ్‌ 22 డేస్‌ చేశాం. ‘ఎఫ్‌ 2’కు నచ్చిన వారంద‌రికీ ‘ఎఫ్‌ 3’ కూడా నచ్చుతుంది. ఇది ఎఫ్ 2కి సీక్వెల్‌ కాదు. ‘ఎఫ్‌ 2’ అనేది భార్యల గురించి ఫ్రస్ట్రేషన్‌ అయితే ఎఫ్‌ 3 డబ్బు గురించి ఫ్రస్ట్రేషన్‌.

ఆ కథ హృతిక్‌రోషన్‌తో చేయాలనుండి

రామ్‌గారితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. భవిష్యత్‌లో చేస్తాను. బాలకృష్ణగారితో సినిమా ఇంకా కన్ఫార్మ్‌ కాలేదు. మహేశ్‌ బాబుగారితో మరో సినిమా గురించి డిస్క‌ర్ష‌న్స్‌ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడే దాని గురించి చెప్పలేను. ఓ లేడీ ఓరియంటెడ్‌ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ చేద్దామనుకున్నాను. సాయిపల్లవితో చర్చలు కూడా జరిగాయి. కుదర్లేదు. భవిష్యత్‌లో త‌ప్ప‌కుండా ఓ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ చేస్తాను. బాలీవుడ్‌లో మా ‘ఎఫ్‌ 2’ సినిమా రీమేక్‌ అవుతోంది. నేను నా సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయాలనుకుంటే 'పటాస్'‌ను రీమేక్‌ చేస్తాను. ఆ సినిమా హృతిక్‌రోషన్‌తో చేయాలని ఉంది. లైఫ్‌లో మనకు ఇల్లు, పని ముఖ్యం. పని ఎలాగు చేస్తాం కాబ‌ట్టి కుటుంబం కోసం ఓ మంచి ఏరియాలో ఇల్లు తీసుకున్నాను.