Dil Raju Venu Sriram reacts on Vakeelsaab OTT Rumors

Tuesday,April 13,2021 - 02:32 by Z_CLU

'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్ " సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది అనే ప్రచారాన్ని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు కొట్టేశారు. "వకీల్ సాబ్ " సినిమాను థియేటర్ లోనే చూసి ఎంజాయ్ చేయాలని వారు కోరారు.

[video width="480" height="848" mp4="http://admin.zeecinemalu.com/wp-content/uploads/2021/04/dil.mp4"][/video]

*నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ*...వకీల్ సాబ్ సినిమాకు థియేటర్ లో సూపర్ రెస్పాన్స్ ఉంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం అనే వార్తల్లో నిజం లేదు. ఇంత పెద్ద సినిమాను థియేటర్ లో చూస్తే వచ్చే ఆనందం ఓటీటీలో చూస్తే రాదు. ఏ స్టార్ హీరో సినిమా అయినా 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే రూల్ ఉంది. కాబట్టి కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వకీల్ సాబ్ చిత్రాన్ని థియేటర్ లో చూడండి. అన్నారు.

[video width="480" height="480" mp4="http://admin.zeecinemalu.com/wp-content/uploads/2021/04/venu.mp4"][/video]

*దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ*.... వకీల్ సాబ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం లేదు. అలాంటి వార్తలన్నీ ఫేక్. పవర్ స్టార్ సినిమాను థియేటర్ లోనే చూడండి. అన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో స్టడీగా కొనసాగుతోంది. వర్కింగ్ డేస్ అయినప్పటికీ మూవీకి వసూళ్లు వస్తున్నాయి. ఈ వీకెండ్ బిగ్ రిలీజెస్ లేకపోవడంతో.. వకీల్ సాబ్ కు మరిన్ని కలెక్షన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది ట్రేడ్.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics